Home » ప్రపంచ కప్ లో ఇండియాకు ఈజీ.. ఎందుకంటే..?

ప్రపంచ కప్ లో ఇండియాకు ఈజీ.. ఎందుకంటే..?

by Azhar
Ad

ఆస్ట్రేలియా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఇండియా రేపు తమ మొదటి మ్యాచ్ అనేది పాకిస్థాన్ తో ఆడనుంది. ఇక నిన్న ముగిసిన గ్రోపు స్టేజ్ మ్యాచ్ ల తర్వాత… ఇండియా సెమీస్ కు చేరుకోవడం ఈజీ అనే కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం ఇండియా ఉన్న గ్రూప్ లో పెద్దగా పోటీ అనేది లేకపోవడం అనే చెప్పాలి.

Advertisement

అయితే ఇప్పుడు ఇండియా గ్రూప్ బిలో ఉంది. ఇందులో మనతో పాటుగా దాయాధి పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా జట్లు మాత్రమే బలంగా ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే.. ముగిసిన మూడు స్థానాల్లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాంబ్వే జట్లు ఉన్నాయి. కాబట్టి ఈ జట్ల పైన ఇండియా సులువుగా గెలుస్తుంది అని మనం అర్ధం చేసుకోవచ్చు. కానీ పాక్, సఫారీలతో మాత్రం చాల జాగ్రతగా ఉండాలి.

Advertisement

ఇక ఇదే సమయంలో గ్రూప్ ఏలో మాత్రం తీవ్ర పోటీ అనేది జరగనుంది. ఎందుకంటే ఈ గ్రూప్ లో ఆతిధ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో పాటుగా గత నెలలోనే ఆసియా టోర్నీ విజేతగా నిలిచిన శ్రీలంక.. టీ20 లలో చాలా బలంగా ఉండే ఆఫ్ఘనిస్థాన్.. ఇక ఎప్పుడు అందరిని ఆశ్చర్య పరిచే ఐర్లాండ్ జట్లు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ గ్రూప్ తో పోల్చితే మన ఇండియా ఉన్న గ్రూప్ బి లో పోటీ అనేది చాలా తక్కువ అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

మా చేతిలో లేదు.. ప్రభుత్వం చేతిలో ఉంది..!

పాకిస్థాన్ పర్యటన పై రోహిత్ వెర్షన్ ఇదే..?

Visitors Are Also Reading