సాధారణంగా ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సమయానికి సరిగ్గా తినరు. తిన్న సమయంలో బాగానే లాగేంచేస్తుంటారు. ఇలా లాగించడంతో పొట్ట చుట్టూ బెల్లీ ఫ్యాట్ పేరుకుపోతుంటుంది. అతిగా తినడం, ఒత్తిడి,కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం ద్వారా హార్మన్ల మార్పులు వంటి రకరకాల కారణాల ద్వారా పొట్ట చుట్టూ కొవ్వు ఏర్పుడుతుంది.
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల అందహీనంగా కనిపిస్తుంటారు. ఇక ఈ బెల్లీ ఫ్యాట్‌ని కరిగించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. నచ్చిన ఫుడ్‌కి దూరంగా ఉండడం, చెమటలు చిందేలా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. ఇలా చేసినప్పటికీ చాలా మందికి బెల్లీ ఫ్యాట్ కరగదు. ఇక ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సులభంగా బెల్లీ ఫ్యాట్‌ని కరిగించుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
అల్లం టీని డైలీ డైట్‌లో చేర్చుకోవాలి. అల్లం టీ తీసుకోవడం శరీరంలో సహజంగా వేడిని పుట్టించి అధిక కేలరీలను, కొవ్వును కరిగిస్తుంది. అదేవిధంగా ప్రతీ రోజు ఉదయం నానబెట్టిన బాదంను 8 నుంచి 10 వరకు తీసుకోవాలి. బాదంలో ఉండే మెగ్నీషియం మజిల్ స్ట్రెంథ్‌ను పెంచుతుంది. దీని ద్వారా బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉండే బాదం తీసుకోవడం ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి. దీని ద్వారా బెల్లీ ఫ్యాట్‌కి చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా అవకాడో, ఫైనాపిల్,పుచ్చకాయ, నిమ్మ, క్యారెట్ వంటివి డైట్‌లో చేర్చుకోవడంతో పాటు క్రమం తప్పకుండా 20 నిమిషాల పాటు వ్యాయామాలు చేస్తే బెల్లీ ఫ్యాట్‌ని కరిగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి : iBomma : ఐ బొమ్మకి సినిమాలు ఎలా వస్తాయో తెలుసా..?