తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఎదిగాడు లోకేష్ కనగరాజ్. తమిళంలో 2016లో అవియన్ అనే మూవీతో లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆ తరువాత 2019 ఖైదీ సినిమా తెరకెక్కించాడు. కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు రెండు భాషల్లో విడుదలైంది. ఖైదీ సినిమా సూపర్ హిట్ కావడంతో లోకేష్ పేరు మాత్రం మారుమ్రోగిపోయింది. ఇక ఆ తరువాత దళపతి విజయ్ తో మూవీ చేసే ఛాన్స్ అందుకున్నాడు.
Advertisement
దళపతి విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు. దళపతి విజయ్ హీరోగా 2021లో మాస్టర్ అనే సినిమా చేసాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. ఆ తరువాత వచ్చిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ మూవీకి విక్రమ్ సినిమాకి లింక్ పెట్టాడు లోకేష్. దీంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) అనేది మొదలైంది. ఒక సినిమా కథకు మరో సినిమా కథను లింక్ చేస్తూ.. స్టార్ హీరోలతో చేస్తున్నాడు లోకేష్. ఈ తరుణంలో రీసెంట్ గా మరోసారి దళపతి విజయ్ తో కలిసి లియో మూవీ చేశాడు.
Advertisement
ఈ మూవీ కూడా LCU లో భాగమే.. లియో మూవీలో చివరలో విక్రమ్ అంటే కమల్ హాసన్ విజయ్ తో ఫోన్ లో మాట్లాడటం చూపించాడు లోకేష్. దీంతో నెక్ట్స్ సినిమా పై అభిమానుల్లో అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు LCU అభిమానులకు లోకేష్ షాక్ ఇవ్వనున్నా డని తెలుస్తోంది. ఇకపై LCU లో భాగంగా లోకేష్ సినిమాలు చేయడట. ఆయన అసిస్టెంట్స్ మాత్రమే ఇకపై సినిమాలను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇకపై తాను LCU మూవీస్ చేయనని.. డిఫరెంట్ స్టోరీ సినిమాలు మాత్రమే చేస్తానని.. LCU బాధ్యత తన అసిస్టెంట్స్ తీసుకుంటారని త్వరలోనే లోకేష్ ప్రకటించనున్నాడు. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.
మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!