ఒక్కోసారి మనకు తెలియక చేసిన చిన్న చిన్న తప్పులే మనకు పెద్ద సమస్యగా మారిపోతాయి. దీనివల్ల అనేక ఇబ్బందుల పాలయ్యే అవకాశాలుంటాయి. ముఖ్యంగా వాస్తుకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఇంట్లో ఉండే వారిపై తప్పక ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, దర్వాజాలు కిటికీలు ఎక్కడ ఉండాలి, వంటగది,పూజగది ఎక్కడ నిర్మించాలి అనే అంశాలలో చాలా విషయాలను మనం గమనించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లే కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతిస్తాయి.
Advertisement
చాలామంది ఇండ్లలో చెత్త డబ్బాలను ఇంటి బయట లేదా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పెడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా చెత్త డబ్బాను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ధనలక్ష్మికి కోపం వస్తుందట. ఈ పొరపాట్లు ఎంతటి ధనికులనైన మళ్లీ బీదవాన్ని చేస్తుందట. అందుకే ఇంట్లో ప్రవేశద్వారం వద్ద ఎప్పుడు కూడా చెత్త బుట్ట నుంచకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. చాలామంది మంచంలో కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఇది ఆచరణీయమైన పద్ధతి కాదు.
Advertisement
also read:అల వైకుంఠపురం సినిమాలో చూపించిన ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా..?
ఈ విధంగా తరచూ చేస్తే ఇంట్లో ఉండే ధనలక్ష్మి ఆగ్రహానికి గురవుతుందట. దీనివల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే సాయంత్రం పూట పాలు, పెరుగు,ఉప్పు దానం చేయకూడదని దీనివల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని, వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట వీటిని దానం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
also read: