Home » లక్ష్మీ రాయ్ కి లక్కీ ఛాన్స్…మరోసారి బాలయ్య సినిమాలో…!

లక్ష్మీ రాయ్ కి లక్కీ ఛాన్స్…మరోసారి బాలయ్య సినిమాలో…!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడం… బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగటం తో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ మీద ఉంది. అయితే అఖండ సినిమా విజయం తర్వాత బాలయ్య తదుపరి సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య నెక్స్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది.

Raai laxmi

Raai laxmi

ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హాట్ హీరోయిన్ లక్ష్మీరాయ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా… లక్ష్మీ రాయ్ సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించబోతోంది అంటూ టాక్ వినిపిస్తోంది.

Advertisement

Advertisement

లక్ష్మీ రాయ్ గతంలో బాలయ్య పక్కన “అధినాయకుడు” లో నటించింది. అయితే మళ్లీ ఇంతకాలానికి లక్ష్మీ రాయ్ కి బాలయ్య పక్కన నటించే ఛాన్స్ దక్కింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో అర్జున్ విలన్ గా నటించబోతున్నారని కూడా ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. మరోవైపు త్వరలోనే గోపీచంద్- బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ ఉంది.

Visitors Are Also Reading