రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం బారినపడ్డారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడింది. అంతే కాకుండా రూ. 60 లక్షల జరిమానా విధించారు.
Advertisement
Advertisement
అయితే ప్రస్తుతం జైలు లో ఉన్న ఆయన అస్వస్థత కు గురవ్వడం తో జార్కండ్ రాజధాని రాంచిలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన అనారోగ్యం బారిన పడటం తో ఆయన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.