భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఒక కొత్త చరిత్రనే సృష్టించాడు. ఇండియా ఓపెన్-2022లో ఆదివారం రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో సింగపూర్ ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ లోహ్ కియన్ యూనిపై 24-21, 21-17 స్కోరు తేడాతో లక్ష్యసేన్ గెలుపొందాడు. అదేవిధంగా ఈ టైటిల్ను గెలుచుకున్న మూడవ భారత పురుష ఆటగాడిగా నిలిచాడు లక్ష్యసేన్. అతడి కంటే ముందు 1981లో ప్రకాశ్ పదుకుణే, ఆ తరువాత 2015 సంవత్సరంలో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచి తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
Advertisement
Advertisement
ఇవాళ జరిగిన మ్యాచ్లో ప్రపంచ ఛాంపియన్ ముందు లక్ష్యసేన్ దూకుడుగా షాట్లు ఆడి టైటిల్ దక్కించుకున్నాడు. కేవలం 54 నిమిషాల వ్యవధిలోనే లక్ష్యసేన్ ఘన విజయం సాధించడం విశేషం. గత సంవత్సరం ప్రపంచ ఛాంపియన్షిప్లో తన మెరుపులతో మెరిపించి.. కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈ టైటిల్ తన బ్యాగ్లో వేసుకుని పలు రికార్డులను సృష్టించాడు. మరొక వైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కలిసి ఇండోనేషియన్ జంటను ఓడగొట్టి టైటిల్ను కైవసం చేసుకున్నారు.