తెలుగు ఇండస్ట్రీలో తాత నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాబాయ్ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు.. అలాంటి ఎన్టీఆర్ నిజ జీవితంలో తన భార్య కోరికకు అడ్డు చెప్పారట.. మరి ఆమె కోరిన కోరిక ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఇండస్ట్రీలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ప్రణతినీ ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.ప్రణతి కూడా ఎన్టీఆర్ గౌరవానికి తగ్గట్టు తన కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ నందమూరి ఫ్యామిలీకి మంచి పేరు తీసుకు వస్తుంది.
Advertisement
ALSO READ:బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?
Advertisement
తన భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా సాగుతున్న ఈ ఫ్యామిలీలో ప్రణతి ఒక తీరని కోరిక ఉందట.. ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఏకంగా ప్రాణాలకు సైతం లెక్క చేయలేదని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ దంపతులకు పిల్లలంటే చాలా ఇష్టం. వీరికి ఇద్దరు అబ్బాయిలు అన్న విషయం అందరికి తెలిసిందే. కానీ తనకి ఒక అమ్మాయి కావాలని చాలా బలమైన కోరిక ఉందట. రెండవ సారి ఆమె గర్భం దాల్చినప్పుడు తప్పకుండా అమ్మాయి పడుతుందని ఆశగా ఎదురు చూసిందట.
కానీ కొడుకు పుట్టడంతో ప్రణతి డిసప్పాయింట్ అయిందనీ ఎన్టీఆర్ ఒక సందర్భంలో తెలియజేశారు. తనకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ఉండడం చేత తన కోరికను నెరవేర్చడం కోసం మూడవసారి గర్భం దాల్చడానికి కూడా సిద్ధం అయిందని ఎన్టీఆర్ చెప్పారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వద్దని చెప్పారట ఎన్టీఆర్.. ఈ విధంగా తన భార్యకున్న చిరకాల వాంఛను బయటపెట్టాడు ఎన్టీఆర్.. మరి ముందు ముందు అయినా ప్రణతికి ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
ALSO READ: