Home » ఇలాంటి వస్తువులను కింద పెడితే లక్ష్మీదేవికీ కోపం వస్తుందట..!!

ఇలాంటి వస్తువులను కింద పెడితే లక్ష్మీదేవికీ కోపం వస్తుందట..!!

by Sravanthi
Ad

హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది ప్రజలు దేవుళ్లను ఆరాధిస్తారు. అనేక కోరికలు కోరుకొని నెరవేరడం కోసం పలు విధాలుగా పూజలు కూడా చేస్తారు. అలా కొన్ని నమ్మకాలు కూడా పూర్వకాలం నుంచి కొనసాగుతూ వస్తున్నాయి . అలాంటి వాటిని హిందువులు పాటిస్తూ వస్తున్నారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవికి కొన్ని పనులు చేస్తే ఆగ్రహం వస్తుందట.. మరి ఆ పనులు ఏంటో చూద్దామా.. ముఖ్యంగా మన పూజకు సంబంధించి ఎలాంటి వస్తువులు అయినా మనం కింద పెట్టం ..

Advertisement

Also Read:ఆదివారం వస్తే చాలు ఇక అలియా భట్ ఆ పనిలో మునిగి పోతుందట..!!

కర్పూరం,కొబ్బరి నూనె, కొబ్బరికాయ, పువ్వులు ఇలాంటి వస్తువులను కింద పెట్టకూడదు . ఒకవేళ కింద పెడితే మాత్రం పూజకు ఉపయోగించకూడదట. హిందూ ధర్మం ప్రకారం ఇంకొన్ని వస్తువులు కూడా పెట్టకూడదని అంటున్నారు.ముఖ్యంగా సాలీ సామాగ్రి కూడా కింద పెట్టకూడదట. ఎందుకంటే సాలిగ్రామం విష్ణుమూర్తి ప్రతిరూపం. అందుకే ఈ తప్పులు చేయకూడదట. అలాగే జంధ్యాన్ని కూడా కింద పెట్టరాదు. ఈ జంధ్యాన్ని గురువులకు, తల్లిదండ్రులకు ప్రతిరూపంగా భావిస్తారు. వీటిని నేల మీద అసలు పెట్టకూడదట.

Advertisement

Also Read:ఛీ.. ఛీ.. తమన్నాకు మరీ ఇలాంటి అలవాటు ఉందా.. మగాళ్లు కనిపిస్తే చాలు..!!

దీపాన్ని కూడా నేల మీద పెట్టకూడదు . దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం కానీ ఒక తమలపాకును కానీ పెట్టడం మంచిది. నేలపై పెడితే దేవతలకు అవమానం కలిగినట్టు అవుతుందట. అలాగే బంగారాన్ని కూడా కింద పెట్టకూడదు ఎందుకంటే బంగారం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అంటారు. అంతేకాకుండా శంఖువుని కూడా కింద అస్సలు పెట్టకూడదట. ఎందుకంటే లక్ష్మీదేవి ఇందులో కొలువై ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి కింద పెడితే లక్ష్మీదేవికి కోపం వస్తుందట.

Also Read:ఉపాసన కోసం మెగాస్టార్ మదర్ స్పెషల్ వంటకం..ఇంతకంటే ఏం కావాలి..!

Visitors Are Also Reading