దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు.. వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కిందట… వైయస్సార్ తెలంగాణ అనే పార్టీతో తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యం అంటూ… గత ఏడాదిన్నర కాలంగా… తెలంగాణలో తెగ పోరాటం చేస్తోంది షర్మిల. ఈ షర్మిల ఎంత పోరాటం చేసినప్పటికీ.. ఆ పార్టీలోకి ఏ ఒక్క కీలక నేత గాని… కార్యకర్త గాని వెళ్ళటం లేదు.
Advertisement
దీనికి కారణం వైఎస్ షర్మిల ఆంధ్రకు చెందిన వ్యక్తి. ఆంధ్ర నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు తెలంగాణ వ్యక్తులు ఏ ఒక్కరు సపోర్ట్ చేయాలన్నది వాస్తవం. కానీ షర్మిల మాత్రం తాను రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ పోకడలకు పోతోంది. అయితే ఆమె ఎంత పోరాటం చేసిన… ఫలితం లేకుండా పోవడంతో… తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుందట. దీనిపై ఇప్పటికే చాలా మీడియాలలో వార్తలు కూడా వచ్చాయి.
Advertisement
అయితే తాజాగా ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రాబోతుందంటూ కెవిపి రామచంద్రారావు ప్రకటన చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆమె పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ వాదిగా తాను సమర్థిస్తున్నట్లు కూడా తెలిపారు. మొదట్లో షర్మిల కూడా కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి ఆమె ఈ పార్టీలోకి వస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
తాబేలు ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మీ కలలో ఇవి కనుక కనపడ్డాయి అంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది!
అక్కినేని అమలను గాఢంగా ప్రేమించి…జీవితం నాశనం చేసుకున్న నటుడు…!