ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అంతకు ముందు ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
ఎప్పుడో సుమతీ శతకంలో బద్దెన రాసిన ఈ పద్యం ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. దానికి కారణం కేటీఆర్. ఈరోజు కేటీఆర్ తన ట్విట్టర్లో ఎప్పుడో పెద్దలు చెప్పినట్టు అంటూ కనకపు సింహాసం మీద అనే పద్యాన్ని పోస్ట్ చేశారు. మంచి ముహూర్తం చూసి కుక్కను సీట్లో కూర్చోబెట్టినా దాని మనసు మారదు. ఇది పెట్టి తానేమీ అనవసరంగా నోరు పారేసుకోలేదని కూడా స్పష్టత ఇచ్చారు. రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు..మేము అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవని కేటీఆర్ అన్నారు. మీకు చేతనైతే ఇచ్చిన 420 అమలుపరచండి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచండి. ప్రజల దృష్టిని మరలచే ప్రయత్నాలు ఎన్ని చేసిని ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేదాకా వెంటాడుతామని హెచ్చరించారు కేటీఆర్.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!