Home » సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం !

సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం !

by Bunty
Ad

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు గుండెపోటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. హరినాథరావుకు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన గచ్చిబౌలిలోని A/G ఆసుపత్రికి తరలించారు.

Advertisement

కాగా ఆరోగ్యం మరింత విషమించడంతో గురువారం 1:10 నిమిషాలకు పాకాల హరినాథరావు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  హరినాథరావు మృతితో మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ ఆసుపత్రికి వెళ్లారు. హరినాథరావు పార్థివ దేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు.

Advertisement

అక్కడకు చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు హరినాథరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్ తన కోడలు శైలిమను కేసీఆర్ ఓదార్చారు. అలాగే హరినాథరావు కుటుంబ సభ్యులను కేసీఆర్ దంపతులు ఓదార్చారు.

ఇవి కూడా చదవండి  : ఏపీ నిరుద్యోగులకు జగన్ శుభవార్త.. కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

Visitors Are Also Reading