Home » పుట్టిన రోజు వేడుక‌ల‌కు కేటీఆర్ దూరం.. కార‌ణం ఏమిటో తెలుసా..?

పుట్టిన రోజు వేడుక‌ల‌కు కేటీఆర్ దూరం.. కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji
Ad

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూలై 24 ఆదివారం రోజు 46వ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించాలని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప‌లు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు కేటీఆర్ ప్ర‌క‌టించారు. భారీ వర్షాలు వరదల వల్ల పలు జిల్లాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారికి టీఆర్ఎస్ శ్రేణులు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద తోచిన సాయం చేయాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు తన జన్మదిన వేడుకలకు బదులుగా స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్.


ఇప్ప‌టికే కేటీఆర్ పుట్టిన‌రోజున రాష్ట్ర వ్యాప్తంగా కేక్ క‌టింగ్ కార్య‌క్ర‌మాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, సర్వమత ప్రార్ధనలు, చీరలు, పండ్లు, అన్నదానం చేసేందుకు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు యువతకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్ యాదవ్ నేతృత్వంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక కేటీఆర్ పేరు మీద 116 ఆలయాల్లో అర్చనలు చేయిస్తామని, త్రీడి గ్రాఫిక్స్ తో స్పెషల్ కేక్, కేటీఆర్ జీవితం పై ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తామని సాయి కుమార్ యాదవ్ శుక్రవారం మీడియాకు వెల్ల‌డించారు.

Advertisement

Advertisement


ద లీడర్ ఫ్రం ద లోకల్ టు గ్లోబల్ పేరిట డాక్యుమెంటరీ విడుదల ఉంటుందన్నారు. కేటీఆర్ ప్రస్థానం యావత్తు ఆ డాక్యుమెంటరీ చిత్రంలో చూడ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఇక కేక్ లో గత 8 ఏళ్లలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ‘రైజ్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో చూడవచ్చని చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మరో మారు భారీ వర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచే పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు అలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Also Read : 

ఆ నలుగురు స్టార్ హీరోలే.. కానీ ఏఎన్నార్ తో జతకట్టి అట్టర్ ఫ్లాప్.. కారణం..?

ఆ హీరోయిన్ మాజీ భర్తతో అనుష్క ఇలా చేయబోతోందా.. త్వరలోనే శుభవార్త ఏంటంటే..?

Visitors Are Also Reading