ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్‌ను ఇండియన్ క్రికెట్ ప్లేయర్ కేఎస్ భరత్ (కోన శ్రీకర్ భరత్) నిన్న కలిశారు. ఈ సందర్భంగా టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను అభినందించారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి బహుకరించారు కేఎస్ భరత్.
Advertisement
ఈ సందర్భంగా టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ మాట్లాడుతూ, ఇండియన్ క్రికెట్ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్ కేప్టెన్‌గా వ్యవహరించడం నాకు గర్వంగా ఉందన్నారు. ఈ విషయాలు సీఎం జగన్ మోహన్ రెడ్డితో పంచుకున్నానని వెల్లడించారు భరత్. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు, మద్దతు కావాలని అడిగానన్నారు టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్.
Advertisement
దేశం గర్వపడేలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం జగన్ సూచించారన్నారు టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏపీలో స్పోర్ట్స్ ప్రమోషన్ బావుందని, క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్. ఈ ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారన్నారు టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్.
ఇవి కూడా చదవండి :
Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్.. ఫ్యాన్స్‌కు పండగే!
హీరో గోపీచంద్ భార్యను ఎప్పుడైనా చూశారా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
ఒకే ఓవర్ లో 6 వికెట్లు… 12 ఏళ్ల కుర్రాడు చరిత్ర