గత కొంతకాలంగా ఆసియా కప్ 2023 నిర్వహణపై పూర్తిగా గందరగోల పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆసియా కప్ 2023 పాకిస్తాన్ దేశంలో జరగాల్సి ఉంటుంది. అయితే కొన్ని భద్రత విషయాల దృశ్య… టీమిండియా పాకిస్తాన్ లో చాలా రోజుల నుంచి పర్యటించడం లేదు. దీంతో ఆసియా కప్ 2023 నిర్వహణ పాకిస్తాన్ లో జరిగితే తాము ఆడబోమని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అటు పాకిస్తాన్ కూడా ఇదేవిధంగా మొండిగా వ్యవహరించింది.
Advertisement
దీంతో ఆసియా కప్ నిర్వహణ చాలా సంక్లిష్టంగా మారింది. అయితే తాజాగా ఇండియా మరియు పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలు నిర్వహించిన… ఆసియా క్రికెట్ కౌన్సిల్… ఆసియా కప్ 2023 షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31వ తేదీన ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ మాసం 17వ తేదీ వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్టు పాల్గొననున్నాయి. టీమిండియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు నేపాల్ ఉన్నాయి.
Advertisement
నేపాల్ తొలిసారిగా ఈ ఆసియా కప్ లో ఆడేందుకు అర్హత సాధించింది. దీంతో జట్లన్నీ రెండు గ్రూపులుగా విడిపోనున్నాయి. ఈ లెక్క ప్రకారం ఒకే గ్రూప్లో టీమ్ ఇండియా మరియు పాకిస్తాన్ అలాగే నేపాల్ జట్లు ఉండనున్నాయి. మరో గ్రూప్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్లు ఉంటాయి. మొత్తం 13 మ్యాచులు జరిగే ఈ టోర్నీలో కేవలం నాలుగు మ్యాచ్లే పాకిస్తాన్లో జరగనున్నాయి. మిగతా 9 మ్యాచ్లకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తుంది. అంటే ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్ మరియు శ్రీలంక దేశాలలో జరగనుంది అన్నమాట. ఈ ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో జరగనుంది.
ఇవి కూడా చదవండి :
బాలయ్య కూతురిగా కృతి శెట్టి… షాక్ లో ఫ్యాన్స్ ?
కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసా?
టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా హీరో ?