Home » రెండవ సినిమాకే రెండు లిప్ లాక్స్… బేబమ్మ జోరు

రెండవ సినిమాకే రెండు లిప్ లాక్స్… బేబమ్మ జోరు

by Bunty
Ad

‘ఉప్పెన’ ఫేమ్ బ్యూటీ కృతి శెట్టి షాకుల మీద షాకులు ఇస్తోంది. ఆమె నానితో కలిసి నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ట్రైలర్ నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదలైంది. ఇందులో అంతా బాగానే ఉన్నా కృతి శెట్టి సన్నివేశాలపై మాత్రం అందరి దృష్టి పడింది. స్పష్టంగా చెప్పాలంటే ఒక వర్గం ప్రేక్షకులకు ట్రైలర్‌లో హై పాయింట్‌గా కన్పించింది ఏమిటంటే నాని, కృతి మధ్య ముద్దు సన్నివేశం మాత్రమే. ఒక షాట్‌లో నాని తన టాప్‌ని తీసి వేసి, ఆ తర్వాత ఉద్వేగభరితంగా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకోవడం కనిపించింది. అప్పట్లో అదే సినిమా లోని ఓ సాంగ్ ప్రోమో లో కృతి లిప్ లాక్ సీన్ బాగా వైరల్ అయింది. ఈ రెండింటిని బట్టి చూస్తే కృతి తన రెండవ తెలుగు చిత్రంలోనే రెండు లిప్ లాక్‌లు చేసినట్లు కనిపిస్తోంది.

Advertisement

Advertisement

అయితే హీరో హీరోయిన్లు లిప్ లాక్ చేయడం కొత్త విషయం కాదు. సమంత వంటి నటీమణులు తమ తొలి చిత్రాలలోనే అలాంటి సన్నివేశాల్లో నటించారు. అయితే కృతి ఉప్పెనలో అందమైన పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించడం, శ్యామ్ సింగ రాయ్‌లో అలాంటి హాటెస్ట్ కాస్మోపాలిటన్ పాత్రకు మారడం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఈ స్పైసీ చర్యలు ఆమెను చాలా మంది ఎలిజిబుల్ బ్యాచిలర్‌ల హృదయాలకు మరింత దగ్గరయ్యేలా చేస్తాయని చెప్పొచ్చు. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.

Visitors Are Also Reading