Home » ఎన్టీఆర్ చెప్పిన ఆ డైలాగ్స్ ప్రిపేర్ కాదట..!

ఎన్టీఆర్ చెప్పిన ఆ డైలాగ్స్ ప్రిపేర్ కాదట..!

by Azhar
Ad
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రశుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ యాక్టర్ అనేది అందరికి తెలుసు. ఈ విషయాన్ని తోటి హీరోలు కూడా చాలాసార్లు చెప్పాడు. అయితే ఎన్టీఆర్ నటనతో పాటుగా డైలాగ్స్ కూడా అదరగొడుతాడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న హీరోలలో ఏదైనా పెద్ద డైలాగ్ చెప్పాలంటే.. అది ఎన్టీఆర్ వల్లే సాధ్యం అవుతుంది. ఇంకా ముఖ్యంగా కోర్టు సీన్స్ అంటే ఎన్టీఆర్ రెచ్చిపోతాడు.
ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో రాఖీ అలాగే టెంపర్ సినిమా యొక్క కోర్టు సీన్స్ అనేవి ఎవరు మర్చిపోరు. అయితే ఇందులో రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కోర్టులు చెప్పిన డైలాగ్స్ ప్రిపేర్ చేసినవి కాదు అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ రాఖీ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు అనేవి చేసాడు.
కృష్ణవంశీ మాట్లాడుతూ.. రాఖీ సినిమాలోకి కోరు సీన్స్ లో ఎన్టీఆర్ చేసిన డైలాగ్స్ అన్ని ప్రిపేర్ చేసినవి కాదు.. మేము ఈ సీన్ కోసం మొదట గోపాలకృష్ణతో.. ఆ తర్వాత ఉత్తేజ్ తో.. అలాగే నేను కొన్ని డైలాగ్స్ రాసాము. అవి ఎన్టీఆర్ కు వినిపించం. కానీ సీన్ లో మాత్రం ఎన్టీఆర్ ఎక్కువగా ప్రిపేర్ చేసిన డైలాగ్స్ కాకుండా కొత్త డైలాగ్స్ చెప్పాడు. ఇక అక్కడ ఎన్టీఆర్ చెప్పిన ప్రతి డైలాగ్ ను మేము మళ్ళీ రాసుకున్నాము అని కృష్ణవంశీ పేర్కొన్నారు.

Advertisement

Visitors Are Also Reading