ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్యకృష్ణ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రమ్యకృష్ణ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఓ వైపు హీరోయిన్ గా రాణిస్తూ మరోవైపు విలన్ నెగిటివ్ రోల్స్ తో కూడా అదరగొట్టింది. ఇక బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ రేంజ్ పాన్ ఇండియా లెవల్ కు చేరుకుంది. రీసెంట్ గా లైగర్ సినిమాలో నటించి మెప్పించింది.
ఇదిలా ఉండగా రమ్యకృష్ణ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. రమ్యకృష్ణ ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీని వివాహం చేసుకుంది. కృష్ణ వంశీ దర్శకత్వం లో రమ్యకృష్ణ మొదటి సారి చంద్రలేఖ సినిమాలో నటించింది. ఈ సినిమా సమయం లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరవాత వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం రమ్యకృష్ణ చెన్నై లో ఉండగా కృష్ణ వంశీ హైదరాబాద్ లో ఉంటున్నారు.
Advertisement
Advertisement
కృష్ణ వంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ….రమ్యకృష్ణ రేంజ్ కు నేను చేరుకోవాలనే ఉంది. ఆమె నాకు కాంపిటీషన్. నాకు ఖాళీ ఉన్నప్పుడు చెన్నై వెళ్తా రమ్య కు ఖాళీ ఉంటే ఇక్కడికి వస్తుంది.
మేము కలిసే ఉన్నాం ఎవరూ కంగారు పడవద్దు. మేం విడిపోయాం ఎన్నో గాసిప్ లు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోము. మా కొడుకు రిత్విక్ పదో తరగతి చదువుతున్నాడు. చాలా యాక్టిివ్ మద్రాస్ లో పెరుగుతున్నాడు. రమ్య ఎప్పుడూ వాడి పై ఒక కన్నేసి ఉంచుతుంది. అంటూ కృష్ణ వంశీ రమ్య కృష్ణ తో రిలేషన్ షిప్ పై స్పందించారు.
Also read : అభిమానులకు శుభవార్త చెప్పిన సింగర్ సునీత.. అది వింటే సంతోషపడడం పక్కా..!