సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. అన్ని విషయాల్లో కూడా ఆయన డేర్ అండ్ డాషింగ్ గా ఉంటారు, ప్రయోగాత్మక చిత్రాలని తీయడానికి కూడా ఎప్పుడూ ముందే ఉండేవారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొన్ని కొత్త జోనర్లు పరిచయం చేసిన ఘనత కృష్ణ గారిదే. ఎంత ఛాలెంజ్ క్యారెక్టర్ లో అయినా కూడా చెయ్యగలిగే గొప్ప నటుడు ఈయన. అంతేకాకుండా ఒక సినిమాను చేయాలనుకుంటే దాని వలన నష్టాలు వస్తాయని అస్సలు ఆలోచించరు.
Advertisement
కృష్ణ ఎన్నో రిస్కీ సినిమాలని తెరకెక్కించి సంచలనాన్ని సృష్టించారు. అల్లూరి సీతారామరాజు సినిమా కూడా అందులో ఒకటి. ఈ మూవీ ఒక ఎత్తు ఆయన కెరియర్ లో సినిమాలు అన్ని ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. మిగతా సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోదగిన ఓ సినిమా 53 ఏళ్ల క్రితం విడుదల అయింది ఆ సినిమా ఏకంగా 80 దేశాల్లో రిలీజ్ బంపర్ హిట్ అందుకుంది. అదే మోసగాళ్లకు మోసగాళ్ళు. కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చింది. 1971 లో విడుదలైంది. కృష్ణ విజయనిర్మల నాగభూషణం కైకాల సత్యనారాయణ తదితరులు ఇందులో నటించారు.
Advertisement
Also read:
Also read:
కృష్ణ హాలీవుడ్ సినిమాలు బాగా చేసుకోవారు. కౌబాయ్ మూవీలోని ఇష్టపడేవారు ఆయనకి తెలుగులో కూడా కౌబాయ్ చిత్రం చేయాలనే ఆలోచన వచ్చింది దానితో ఆరుద్ర కి కథ రెడీ చేయాలని చెప్పారు ఆయన చాలా హాలీవుడ్ మూవీస్ చూసి ఇంగ్లీష్ నవలలు చదివి ఒక కథను సిద్ధం చేశారు మోసగాళ్లకు మోసగాళ్లకు రిలీజ్ సెన్సేషనల్ హిట్ అందుకుంది ఇంగ్లీష్ సినిమాలు నుండి కథ తీసుకుని ఇంగ్లీష్ లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సక్సెస్ ని అందుకుంది. 12 లక్షల దాకా ఖర్చు అవ్వాల్సి ఉంది కానీ కృష్ణ ఏడు లక్షల ఖర్చుతో 28 రోజుల్లో మోసగాళ్లకు మోసగాళ్లు మూవీ నుండి నిర్మించి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!