Home » 15 సంవత్సరాల్లో కృష్ణ, బాలకృష్ణ 21 సార్లు పోటీ పడ్డారని తెలుసా..?

15 సంవత్సరాల్లో కృష్ణ, బాలకృష్ణ 21 సార్లు పోటీ పడ్డారని తెలుసా..?

by Sravya
Ad

అప్పటి హీరోలైనటువంటి కృష్ణ బాలకృష్ణ ఇద్దరు కూడా చాలా సినిమాల్లో నటించారు ఎంతోమంది ప్రేక్షకుల హృదయం గెలుచుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకే తరం హీరోలు కానప్పటికీ ఏకంగా 21సార్లు పోటీపడ్డారు. దాదాపు 15 ఏళ్ల వ్యవధిలో కొన్ని సినిమాలు ఒక వారం గ్యాప్ లో ఇంకొన్ని ఒకేరోజు రెండు మూడు రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. మొత్తం వీళ్ళు 21సార్లు పోటీపడ్డారు. ఆ సినిమాలేంటి ఆ రిజల్ట్ గురించి చూద్దాం. 1984లో కృష్ణ, బాలకృష్ణ ముందు పోటీ పడ్డారు. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా తో తాతినేని ప్రసాద్‌ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా రూపొందిన డిస్కోకింగ్‌ పోటీ పడింది. నాయకులకు సవాల్‌ సూపర్‌హిట్‌ అయ్యింది. పి.సాంబశివరావు దర్శకత్వం లో కృష్ణ సినిమా ఉద్దండుడు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన మంగమ్మగారి మనవడు పోటీ పడితే ఉద్దండుడు సూపర్‌హిట్‌ అయ్యింది.

Advertisement

మంగమ్మగారి మనవడు సెన్సేషనల్‌ హిట్‌ అయి బాలయ్య బాబు కి పెద్ద హిట్‌ తెచ్చింది. అలానే కృష్ణ హీరోగా వచ్చిన దొంగలు బాబోయ్‌ దొంగలు అలానే బాలకృష్ణ హీరోగా రూపొందిన కథానాయకుడు విడుదలయ్యాయి. రెండూ హిట్ అయ్యాయి. కృష్ణ అందరికంటే మొనగాడు, బాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్‌ భలే తమ్ముడు విడుదలయ్యాయి. రెండూ సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. బాలకృష్ణ ఎన్‌.బి.చక్రవర్తి కత్తుల కొండయ్య, విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ సూర్యచంద్ర ఒకసారి రిలీజ్‌ అయ్యాయి. సూర్యచంద్ర చిత్రం సూపర్‌హిట్‌ సాధించింది. బాలకృష్ణ నిప్పులాంటి మనిషి, కృష్ణ బ్రహ్మాస్త్రం కొంత గ్యాప్‌తో రిలీజ్‌ అయ్యాయి. బ్రహ్మాస్త్రం సూపర్‌హిట్‌ అయింది. కృష్ణ జయం మనదే, బాలకృష్ణ సీతారామకళ్యాణం ఒకే వారం రిలీజ్‌ అవ్వగా జయం మనదే హిట్‌ అయింది. సీతారామకళ్యాణం సూపర్‌హిట్‌ అయింది.

Advertisement

కృష్ణ దొంగోడొచ్చాడు, బాలకృష్ణ అల్లరి కృష్ణయ్య ఒకే వారం విడుదలయ్యాయి. దొంగోడొచ్చాడు సూపర్‌హిట్‌ అయింది. కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కలియుగ కర్ణు, బాలకృష్ణ ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌ ఒకేరోజు రిలీజ్‌ అయ్యాయి. ఈ రెండు ఏవరేజ్‌గా నిలిచాయి. బాలకృష్ణ దొంగరాముడు, కృష్ణ చుట్టాలబ్బాయి ఒకే వారం వచ్చాయి. ఈ రెండు ఫ్లాప్‌ లు గా మిగిలిపోయాయి. కృష్ణ నటించిన రౌడీ నెంబర్‌ 1, బాలకృష్ణ భారతంలో బాలచంద్రుడు చిత్రాలు ఒకే సీజన్‌లో రిలీజ్‌ అయ్యాయి. కృష్ణ సినిమా హిట్‌ అయింది. అలానే బాలకృష్ణ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన రక్తాభిషేకం, కృష్ణ ప్రజా ప్రతినిది ఒకేరోజు విడుదలయ్యాయి. రక్తాభిషేకం హిట్‌ అయింది.  ఇలా ఏకంగా 21సార్లు పోటీపడ్డారు కృష, బాలకృష్ణ.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading