టాలీవుడ్ సెకండ్ జనరేషన్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. అగ్ర నిర్మాత రామానాయుడు చిన్న కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. మరో జనరేషన్ హీరోలు వచ్చినప్పటికీ ఇంకా తన హవాని కొనసాగిస్తున్నారు వెంకటేష్. వాస్తవానికి వెంకటేష్ హీరో అవుతానని అస్సలు అనుకోలేదట. వాళ్ల బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలని అనుకున్నారట. వెంకటేష్ హీరోగా మారడానికి సూపర్ స్టార్ కృష్ణనే కారణమట.
Advertisement
రామానాయుడు గారు కృష్ణతో ఒక సినిమా చేయాలనుకున్నారట. ఆ సినిమానే కలియుగ పాండవులు. మరోవైపు రాఘవేంద్రరావు గారు రామానాయుడితో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే అది కృష్ణతో తీద్దామని రామానాయుడు అనుకున్నాడు. కానీ కృష్ణ అప్పటికే వేరే నిర్మాతతో చేస్తానని మాట ఇచ్చాడు. ఇదే సమయంలో వేరే హీరో కోసం రామానాయుడు ప్రయత్నిస్తున్నాడు. కృష్ణ గారు ఫోన్ చేసి మీ ఇంట్లోనే హీరోని పెట్టుకుని ప్రపంచమంతా గాలిస్తావేంటి అంటూ ప్రశ్నించారట. ఇక వెంటనే విదేశాల్లో ఉన్నటువంటి వెంకటేష్ ని పిలిపించుకుని హీరోగా పరిచయం చేశారు రామానాయుడు.
Advertisement
Also Read : ఆ గుర్రం కృష్ణకు తప్ప వేరే హీరోకి ఇచ్చేవారు కాదట.. కారణం ఏంటంటే..?
సూపర్ స్టార్ కృష్ణ సెకండ్ జనరేషన్ స్టార్ హీరోలందరితో దాదాపు కలిసి నటించారు. కానీ విక్టరీ వెంకటేష్ తో మాత్రం నటించలేదు. మెగాస్టార్ చిరంజీవితో కొత్త అల్లుడు, బాలకృష్ణతో సుల్తాన్, నాగార్జునతో వారసుడు లాంటి చిత్రాల్లో నటించారు. ఒక్క త్రిమూర్తులు సినిమాలో ఓ పాటలో వెంకటేష్ తో కొన్ని సెకన్ల పాటు కనిపించారు. ప్రత్యేకంగా వీరు కలిసి నటించిన సినిమా లేదు. చిరు, బాలయ్య, నాగార్జునలతో కలిసి నటించిన కృష్ణ వెంకటేష్ తో మాత్రం కలిసి నటించలేకపోయారు. వీరిద్దరూ కలిసి బాలాదూర్ అనే సినిమాలో నటించాల్సి ఉంది. కానీ వెంకటేష్ కలిసుందాంరా., ప్రేమతో రా వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ తెరకెక్కించిన మూవీ బాలాదూర్. కానీ వెంకటేష్ ఆ కథను రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాను మాస్ మహారాజా రవితేజ చేశారు. ఈ చిత్రానికి సురేష్ బాబు నిర్మాత కావడం విశేషం.