తెలుగు ఇండస్ట్రీలో అలనాటి హీరోలలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ ఒక తరానికి చెందిన హీరోలు.. ఇప్పటికే వీరంతా కాలం చేశారు.. కానీ కృష్ణ ఈనెల 14న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి 15 తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో సినీ ఇండస్ట్రీ మరియు అభిమానులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనను చివరిసారి చూసుకునేందుకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఎంతోమంది ఇండస్ట్రీ పెద్దలు కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Advertisement
also read:ప్రస్తుత స్త్రీలు తమకంటే చిన్నవారిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా..?
కానీ కృష్ణ దాహన సంస్కారాలు మాత్రం సాధారణ వ్యక్తికి చేసినట్లు చేయడం ఆయన ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. దీంతో చాలామంది అసహనం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు అయిపోయాయి కానీ ఆయన పెద్దకర్మ విషయంలో కూడా ఈ విధంగా చేయకూడదని అభిమానులు అనుకుంటున్నారు. ఈ తరుణంలోనే ఆయన పెద్దకర్మ తన సొంత ఊరు అయిన బుర్రిపాలెంలో చేస్తే బాగుంటుందని అభిమానుల వాదన. కానీ కృష్ణ గారి కుటుంబ సభ్యులు మాత్రం ఆయన పెద్దకర్మను హైదరాబాదులోని నిర్వహించాలని నిర్ణయించుకున్నారట.
Advertisement
ఇదే విషయంపై సీనియర్ జర్నలిస్టు ఈ మంది రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు పెద్దకర్మను వారి సొంత ఊరు అయిన బుర్రిపాలెంలో నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇదే విషయంపై నమ్రతా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. బుర్రిపాలెంలో పెద్దకర్మ కార్యక్రమాలు నిర్వహిస్తే చాలామంది జనాల హడావిడి, సెక్యూరిటీ సమస్య ఏర్పడుతుందని నమ్రతా భావించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కృష్ణ గారి పెద్దకర్మ విషయం అనేది వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకే జరుగుతుంది ఇది వారి వ్యక్తిగత విషయం.. కానీ ఈ మధ్యకాలంలోనే కృష్ణంరాజు కూడా మరణించారు. ఆయన పెద్దకర్మను యంగ్ రెబల్ స్టార్ సొంత ఊర్లోనే నిర్వహించారు. కానీ కృష్ణ గారి పెద్దకర్మ మాత్రం హైదరాబాదులోనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
also read: