Home » హీరోయిన్ జమున ఆ స్టార్ హీరో వల్లే 45 ఏళ్లుగా వ్యాధితో బాధపడుతోందా..?

హీరోయిన్ జమున ఆ స్టార్ హీరో వల్లే 45 ఏళ్లుగా వ్యాధితో బాధపడుతోందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాటి మేటి హీరోయిన్లలో జమున అంటే తెలియని వారు ఉండరు. ఆమె ఏ పాత్ర చేసిన ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. అలాంటి స్టార్ హీరోయిన్ జమున ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసింది. తెలుగు ఇండస్ట్రీలోని అప్పటి స్టార్ హీరోలందరితో జత కట్టింది. ఇక జమున అందాల నటుడు హరినాథ్ తో లెక్కకు మించి సినిమాలు చేసింది. దాదాపు వారి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది లేత మనసులు మూవీ. ఇది జమున కెరీర్ ను మలుపు తిప్పింది అనుకోవచ్చు. ఇదే సినిమా ఆమె పాలిట శాపంగా కూడా మారింది..

Advertisement

also read:మెస్సీ జెర్సీలో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?

అదేంటో ఇప్పుడు చూద్దాం..అప్పట్లో లేత మనసులు సినిమా షూటింగ్ జరుగుతోంది. జమున హరినాథ్ జంట మీద ” అందాల ఓ చిలక.. అందుకో ఈ లేఖ” అనే పాట షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు ఒక షాట్ తీస్తున్నాడు. షాట్ ప్రకారం హీరోయిన్ జమున గడ్డి కుప్ప మీద నుంచి కిందికి దూకితే హీరో హరినాథ్ ఆమెను ఫాలో అవ్వాలి. ముందు ఒక షాట్ అయిపోయింది. బాగానే వచ్చింది కానీ, కానీ డైరెక్టర్ మరింత ఫర్ఫెక్షన్ కోసం మరోసారి చేయాలన్నారు. మళ్లీ జమున ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడ్డి కుప్ప నుంచి కిందికి జారింది. కానీ హరినాథ్ దూకే టైంలో పట్టు తప్పింది. దీంతో హరినాథ్ జమున మీద నేరుగా పడిపోయాడు.

Advertisement

అది కూడా ఆమె మెడపై పడ్డారు హీరో. షాట్ అయిపోయింది. హరినాథ్ జమునకి సారీ చెప్పారు. ఆ టైంలో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు కానీ, సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది, కానీ ఆ ప్రమాదం మాత్రం జమున మెడకు శాపంగా మారింది. ఆమె మెడలో కొన్ని నరాలు నలిగిపోవడం వల్ల ఆమెకు తల ఊపే జబ్బు వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమెను విడిచి పెట్టలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత జమున ఎక్కడ కనిపించినా హరినాథ్ చాలా గిల్టీగా ఫీలయ్యేవారట. ఈ తల ఊగుడు జబ్బు వల్ల జమున సినీ కెరియర్ చాలా వరకు దెబ్బ పడింది.

also read:

Visitors Are Also Reading