సంగీత దర్శకుడు కోటి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వర్ రావు గారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కోటి తొలుత రాజ్ తో కలిసి రాజ్ కోటిగా ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. ఇక వీరిద్దరూ విడిపోయి ఎవరికీ వారు సినిమాలను చేసినప్పటికీ.. రాజ్ కోటీ వయం ఆ తరువాత కూడా సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక కోటి చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్రహీరోలకు సంగీతం అందించి ఎన్నో సూపర్ హిట్స్ అందించారు.
Also Read : Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ
Advertisement
దాదాపు పదేండ్ల పాటు రాజ్ కోటి ఇద్దరూ కలిసి సినిమాలకు మ్యూజిక్ అందించారు. అదేవిధంగా వీరు ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. అలాంటి రాజ్ కోటి ద్వయం అకస్మాత్తుగా విడిపోవడానికి గల కారణాలను మ్యూజిక్ డైరెక్టర్ కోటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. రాజ్ తో చాలా సమయం కలిసే ఉన్నాం. కుటుంబంతో కన్నా ఎక్కువగా రాజ్ తోనే ఎక్కువగా కలిసి ఉన్నాను. పని చేసుకుంటూ ఎక్కువ సమయం గడిపిన మాకు విడిపోవాలన్నప్పుడు నాకు అస్సలు అర్థం కాలేదు. రాజ్ మొదట కలిసి మ్యూజిక్ చేద్దామన్నారు. తానే మొదట విడిపోదామన్నాడు. అందరూ నిర్మాతలు, దర్శకులు, హీరోలు నా దగ్గరకు వచ్చి మాట్లాడటం. . సినిమా గురించి మాట్లాడడం వల్ల రాజ్ కి నేను మ్యూజిక్ చేస్తున్నాను నాతో ఎవ్వరూ మాట్లాడడం లేదనే అంశం బ్రెయిన్ లో పడింది.
Advertisement
Also Read : ధనుష్ ఐశ్వర్య బాటలో మరో స్టార్ కపుల్…అతిత్వరలోనే విడాకులు..?
పక్కన ఉన్న వారు వాటికి జోడించడతో విడిపోవాలనే ఆలోచన రాజ్ కి కలిగింది. విడిపోదామని చెప్పినప్పుడు చాాలా సినిమాలు సెట్ లో ఉన్నాయి. మా ని నమ్మి పెద్ద ఆర్కెస్ట్రా ఉంది. వారందరికీ అన్యాయం చేయలేము. అందుకే తాను రాకపోయినా ఒక్కరినే మ్యూజిక్ రాజ్ కోటి పేరు మీదనే చేశాను. మూడు నెలల పాటు చూసినా రాజ్ విడిపోదామనే సరికి చివరికీ కాళ్లు పట్టుకొని బతిమిలాడాను. అయినా వినలేదు. దీంతో అధికారికంగా అందరికీ విడిపోయామని చెప్పాను. వచ్చిన సినిమా ఆపర్లలో 90 శాతం నా దగ్గర చేయించుకోగా.. 10 శాతం రాజ్ వద్దకు వెళ్లారు. రాజ్ మీద ఇప్పటికీ నాకు ఎలాంటి విరోధం లేదని అంటూ కోటి వివరించారు.