సినిమా ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్ లు అందుకున్నా ఒక ఫ్లాప్ తో దర్శకుల ఫేట్ మొత్తం మారిపోతుంది. ఆ దర్శకుడితో సినిమా చేయాలంటేనే హీరోలు భయపడిపోతారు. అంతేకాకుండా హీరోల అభిమానులు కూడా సినిమా వద్దంటూ సలహాలు ఇస్తారు. ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ పరిస్థితి కూడా అలాగే ఉంది. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Advertisement
ఈ సినిమా తర్వాత స్టార్ హీరో మహేష్ బాబుతో శ్రీమంతుడు తీసే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో కొరటాల శివ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఈ చిత్రం తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా మరోసారి భరత్ అనే నేను సినిమాతో ముందుకు వచ్చాడు.
ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే రీసెంట్ గా కొరటాల చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. అంతేకాకుండా మెగా స్టార్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. మొదటి రోజే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ ప్రారంభమైంది. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో భారీ నష్టాలు వచ్చాయి. ఈ సినిమాకు విడుదలకు ముందే 120 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.
Advertisement
కానీ కేవలం 40 కోట్లు మాత్రమే రాబట్టినట్టు తెలుస్తోంది. దాంతో 80 కోట్ల నష్టాన్ని పూడ్చాల్సివచ్చినట్టు సమాచారం. ఈ సినిమాను ముందుగా కొనిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లు నిర్మాణ భాగస్వామ్యంలో మొదలు పెట్టాయి. కానీ సినిమా ఆలస్యం అవ్వడంతో మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ మధ్యలోనే తప్పుకుంది. దాంతో కొరటాల నిర్మాణ బాధ్యతలు తీసుకుని కొణిదెల ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించారు. ఇక సినిమా విడుదల తర్వాత బయ్యర్లు దారుణంగా లాస్ అవ్వడంతో కొరటాల వాళ్లకు 35 కోట్లను చెల్లించినట్టు సమాచారం. అంతేకాకుండా ఈ డబ్బును చెల్లించడానికి కొరటాల తన 15 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని కూడా అమ్ముకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కొరటాల తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా అయినా కొరటాలకు హిట్ ఇస్తుందా లేదా చూడాలి.
ALSO READ : మహేశ్ బాబు త్రివిక్రమ్ లకు పూజా హెగ్డే కండిషన్స్…అవేంటంటే..!