Home » కొండా ట్రైలర్ వచ్చేసింది….మళ్లీ ఫామ్ లోకి ఆర్జీవీ….!

కొండా ట్రైలర్ వచ్చేసింది….మళ్లీ ఫామ్ లోకి ఆర్జీవీ….!

by AJAY
Ad

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కొండా. ఈ సినిమాను మాజీ మంత్రి కొండ మురళి సురేఖ దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ బయోపిక్ కు కొండా దంపతులే నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ కొండ మురళి దంపతుల స్వగ్రామమైన హనుమకొండలోనే చిత్రించారు. ఇక ఈ సినిమాలో హీరోగా తిర్ గన్ నటించగా హీరోయిన్ గా ఇరా మోర్ నటించింది.

Konda movie trailer

Konda movie trailer

ఇదిలా ఉంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఆర్జివి ట్రైలర్ లో తన మార్క్ చూపించారు. ఆర్జీవి ట్రైలర్ కు ఇచ్చిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ట్రైలర్ లో కొండ మురళి దంపతుల మధ్య ప్రేమ… వాళ్లు రాజకీయాల్లోకి రావడానికి కారణం కొండా మురళి కి మావోయిస్టులతో ఉన్న సంబంధాలు తదితర అంశాలను చూపించారు.

Advertisement

Advertisement

ఇక వీరి రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది కొండా సురేఖ మురళికి ఏ విధంగా సహకరించింది తదితర అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే పలు బయోపిక్ లను తెరకెక్కించిన వర్మ ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ చిత్రం ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading