కొమురం భీం…తన ప్రజల కోసం భూమి భుక్తి కోసం నిజాం రాజుల మెడలు వంచిన గొండువీరుడు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు కొమురం భీం గురించి తెలంగాణ ప్రజలకు తప్ప ఇతర రాష్ట్రాలవారికి తెలియదు. చరిత్రలో కొమురం భీం కనిపించకపోవడానికి కారణాలు ఏంటో గానీ ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత వీరుడి గురించి తెలుసుకోవాలని అంతా అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అందులో కేవలం కొమురంభీం అనే పేరును వాడి కొత్త కథ రాసుకున్నారు.
ALSO READ : MLA Roja Selvamani: రోజా సంచలన ప్రకటన…జబర్దస్త్, సినిమాలకు గుడ్ బై….!
Advertisement
కానీ నిజమైన కొమురం భీం ఎవరు..?ఆయన ఎవరు అన్నది చూపించలేదు. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం….20వ శతాబ్దంలో నిజాం రాజుల పాలనలో వచ్చిన కొత్త చట్టాలు ఉత్తరతెలంగాణ ఆదివాసీల పాలిట శాపంగా మారాయి. ఆదివాసీల భూములను లాక్కోవడం..పంటలను లాక్కోవడం చేసేవారు. వడ్డీ వ్యాపారులు ఆదివాసీల రక్తం పీల్చేవారు. అడవిపై ఉన్న హక్కులన్నీ నిజం సర్కార్ చేతిలోకి తీసుకుని కట్టెలు కూడా కొట్టెనివ్వలేదు. కొమురంభీం 1901 అక్టోబర్ 1న పుట్టారు.
Advertisement
భీం కు 15ఏళ్ల వయసు ఉన్నప్పుడు తమ ఊరికి వచ్చిన సిద్దిక్ అనే నిజాం వేధించడంతో అతడి పై దాడి చేస్తాడు. దాంతో పోలీసులు కొమురంభీం ఊరిపై దాడి చేస్తారు. దాంతో కొమురం భీం అస్సాం పారిపోతాడు. అక్కడ టీ తోటలలో పనిచేస్తూనే చదువునేర్చుకున్నాడు. అక్కడే అల్లూరి సీతారామరాజు గురించి చదివి ఆయన పోరాటం గురించిన విషయాలను తన శిష్యులకు చెప్పేవాడు. అంతే కాకుండా దేశవ్యాప్తంగాజరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి తెలుసుకుని చెప్పేవారు.
ఈ విషయాన్ని కొమురం భీం జీవిత చరిత్ర పుస్తకంలో కూడా రాశారు. ఇక అస్సాం పారిపోయిన భీం మళ్లీ ఐదేళ్లకు ఆసిఫాబాద్ చేరుకుని వివాహం చేసుకున్నారు. అదే సమయంలో కొమురం భీం అన్నలు పన్నెండు గ్రామాల్లో పోడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. దాంతో పోలీసులతో గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలలో భీం తన ప్రజలకు మద్దతుగా నిలిచారు. గోండు ప్రజల సమస్యల పరిష్కారం కోసం నైజా రాజును కలవాలనుకున్నప్పటికీ ఫలితం ఉండదు.దాంతో అటవీ అధికారులపై తిరగబడతారు. ఈ క్రమంలో యుద్దవాతావరణం ఏర్పడుతుంది. భీం సొంతంగా ఆయుదాలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఏడు నెలల పాటూ కొమురం భీం మిలటరీతో యుద్దం చేశారు. ఇక 1940 సెప్టెంబర్ 1న మిలటరీ వెనక నుండి వచ్చి కాల్పులు జరపడంతో కొమురం భీం మరణించారు. ఆయన మరణం తరవాత గోండుల సమస్యలు గుర్తించి పరిష్కరించడం ప్రారంభించారు.