పాన్ ఇండియా సినిమాల హవాతో హీరోలు రెమ్యూనరేషన్ లను భారీగా పెంచేశారు. ముఖ్యంగా తెలుగు తమిళ సినిమాలకు ప్రస్తుతం క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ హీరోలు కూడా రెమ్యురేషన్ లను భారీగా పెంచారు. తాజా కోలీవుడ్ టాక్ ప్రకారం ఏ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం….
Advertisement
Also Read: ఇతర భాషల్లో అత్యధిక సార్లు రీమేక్ చేసిన టాలీవుడ్ 10 సినిమాలు ఏవంటే ?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కో సినిమాకు 120 కోట్ల రెమినరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రజినీ సినిమాలకు కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో రజినీ అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా నిర్మాతలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.
రజనీ తర్వాత కోలీవుడ్ లో హీరో విజయ్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. విజయ్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
Advertisement
అంతేకాకుండా హీరో విక్రమ్ కూడా భారీగా రెమ్యునరేషన్ ను పుచ్చుకుంటున్నాడు. విక్రమ్ ఒక్కో సినిమాకు 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అదేవిధంగా రీసెంట్ గా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్ హాసన్ సైతం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కమల్ ఒక్కో సినిమాకు 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
ఇక టాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ హీరో సూర్య ఒక్కోసినిమా 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు హీరో ధనుష్ కూడా ఒక్కో సినిమాకు 25 కోట్ల వరకు తీసుకుంటున్నట్టుగా కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ధనుష్ తర్వాత హీరో కార్తీ ఒక్కో సినిమాకు 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా టాలీవుడ్ దర్శకుడు అనుదీప్ తో ప్రిన్స్ సినిమా చేసిన శివకార్తికేయన్ ఒక్క సినిమాకు 20 కోట్ల వరకు అందుకుంటున్నట్టుగా సమాచారం.
Also Read: సినిమాల్లోకి అల్లు అర్జున్ సతీమణి…ఆ స్టార్ హీరో సినిమాలో బంపరాఫర్…?