ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్‌కింగ్స్,కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 33 బంతులు ఉండగానే మ్యాచ్ ముగిసింది. కేవలం 31 బంతులు ఆడిన రస్సెల్ 8 సిక్సర్లు, 2పోర్లతో చెలరేగిపోయి 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. 15 బంతుల్లో 5 పోర్లు బాది 26 పరుగులు చేశాడు. సామ్ బిల్లింగ్స్‌కూడా వికెట్లు పడకుండా నెమ్మదిగా 23 బంతుల్లో ఒక సిక్స 1పోర్ తో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Also Read : Viral Video : షారూఖ్ ఔటవ్వగానే చిందులేసిన సుహానాఖాన్, అనన్యపాండే
Advertisement
Advertisement
ఓపెనర్ రహానే 12 పరుగులు చేశాడు. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కేకేఆర్ టీమ్. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ తొలినుంచే తడపాటుకు గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. పంజాబ్ టీమ్‌లో రాజపక్స మాత్రమే రాణించాడు. 9 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో విద్వంసకర బ్యాటింగ్ చేసి 31 పరుగులు చేశారు. రబడ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. లివింగ్ స్టోన్ (19) ధావన్ (16) పరుగులు చేశారు. మొత్తం 18.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి పంజాబ్ టీమ్ 137 పరుగులు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, టిమ్ సౌథి 2, శివం మావి, నరైన్, రస్సెల్ తలో వికెట్ తీశారు.
A thumping win for @KKRiders 💪 💪
The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏
Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ
— IndianPremierLeague (@IPL) April 1, 2022