Home » కోకాపేటలో ఎకరాకు రూ.100 కోట్లు..అప్పుడు ఝాన్సీ చెప్పింది నిజమైందా ?

కోకాపేటలో ఎకరాకు రూ.100 కోట్లు..అప్పుడు ఝాన్సీ చెప్పింది నిజమైందా ?

by Bunty
Ad

ఆదాయం సమకూర్చుకునే పనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి డిమాండ్ ఉన్న భూములను అమ్మేస్తోంది. ఎన్నికలు మరో నాలుగు నెలల్లో మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి కోసం కొన్ని నిధులు కావాలి. దానికోసం ప్రభుత్వ భూములను అమ్మేస్తోంది కేసీఆర్ సర్కార్. ఇక ఇందులో భాగంగానే హైదరాబాద్ మహానగరంలోని కోకాపేటలో ఉన్న భూములను కూడా ఈ- వేలం వేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కోకాపేట భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

Advertisement

కోకాపేట లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించిన నియో పోలీస్ రెండవ దశ వేలంలో కొత్త రికార్డు సాధించింది. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న ఫ్లాట్ నెంబర్ 10 లో ఒక ఎకరం రూ.100.75 కోట్లు పలికింది. దీంతో నియో పోలీస్ భూములు హాట్ కేకు గా మారాయి. న్యూ పోలీస్ 2వ దశ వేలం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా 3319 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఇలా ఉండగా కోకాపేట భూములకు విక్టరీ వెంకటేష్ నటించిన తులసి సినిమాకు లింకు చేస్తున్నారు కొంతమంది. వెంకటేష్ నటించిన హిట్ మూవీ తులసి.

Advertisement

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నయనతార కూడా నటించింది. అయితే ఇందులో ప్రముఖ నటి ఝాన్సీ… కోకాపేట ఆంటీగా నటించింది. అంతేకాదు ఈ సినిమాలో నిండుగా నగలు వేసుకొని… చాలా ఖరీదైన పట్టు చీర కట్టుకొని ప్రతి సీన్ లో కనిపిస్తుంది ఝాన్సీ. అంతేకాదు కోకాపేట భూములు అమ్మి… తనకు నగలు, చీరలు తన భర్త కొనిచ్చాడని ప్రతిసారి నటి ఝాన్సీ చెబుతుంది. ఇప్పుడు ఇదే డైలాగును… కోకాపేట భూములు ఎక్కువ ధరకు వెళ్లడంతో…నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. కోకాపేట ఆంటీ చెప్పింది ఇప్పుడు నిజమైందని… ట్రొలింగ్ కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

వెస్టిండీస్‌తో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్‌!

RCB : ఆర్‌సీబీకి కొత్త కోచ్‌.. వారిద్దరిపై వేటు..ఇక కప్ నమ్ దే

 

Visitors Are Also Reading