భారత క్రికెట్ జట్టుకు దక్షిణాఫ్రికా పర్యటన కాస్త నిరాశనే మిగిల్చింది. టెస్ట్ సిరీస్‌లో ఆధిక్యాన్ని కోల్పోయి.. ఆ తరువాత వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన భారత జట్టు 6 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలవగలిగింది. చివరి మ్యాచ్ ఆదివారం కేప్‌టౌన్‌లో జరిగింది. భారతజట్టు మరొకసారి ఓటమి రుచి చూసింది. భారత మాజీ కెప్టెన్ వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి చివరి వన్డే సంతోషకరమైన క్షణాన్ని తెచ్చిపెట్టింది. కోహ్లీ అర్థ సెంచరీ సాధించాడు.
Advertisement
ముఖ్యంగా కోహ్లీ కూతురు వామిక ఈ సెలబ్రేషన్‌లలో స్టాండ్స్‌ను చూసింది. కోహ్లీ అర్థ సెంచరీని తన కూతురుకు అంకితం ఇవ్వడంతో భారత అభిమానులను కూడా సంతోషపరిచింది. ముఖ్యంగా కూతురు పుట్టి సంవత్సరం దాటినా ఇప్పటివరకు కోహ్లీ తన ఫొటోలు, వీడియోలు సామాజిక మాద్యమాల్లో పంచుకోలేదు కోహ్లీ, అనుష్క దంపతులు. ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగానే నియంత్రించుకున్నట్టు వాళ్లిద్దరూ చెప్పిన సంగతి తెలిసిందే.
Advertisement
కోహ్లీ అర్థ సెంచరి సాధించిన సమయంలో కోహ్లీ కూతురు వామిక వీడియో కెమెరాల కంట పడింది. కోహ్లీ అర్థశతకం సాధించినప్పుడు వామికకు అతన్ని చూపిస్తూ తల్లి అనుష్క చప్పట్లు కొట్టడం వీడియోలో కనిపించింది. ఈ సందర్భంగా కోహ్లీ కూతురు ఫొటోలు తెరపైకి వచ్చాయి. కోహ్లి కూతురు పుట్టిన తరువాత అభిమానులు వామిక చిత్రాన్ని చూడటం ఇదే మొదటిసారి. మరొక వైపు విరాట్ కోహ్లీ అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. దక్షిణాఫ్రికాతో చివరి వన్డేకు ముందు జాతీయ గీతాలాపన సమయంలో అతను చూయింగ్ గమ్ నమలడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.