ఇండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు పిల్లర్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న సీనియర్ ఆటగాళ్లు కూడా వీరిద్దరే. అయితే గతేడాది భారత జట్టు టి20 ప్రపంచ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఓడిన తర్వాత నుంచి భారత్ తరపున వీరిద్దరూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
Advertisement
న్యూజిలాండ్ పర్యటనతో పాటు స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో ఇప్పుడు వెస్టిండీస్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లకు వీరిద్దరూ దూరంగా ఉన్నారు. దీంతో రోహిత్, విరాట్ టి20 క్రికెట్ కెరీర్ ముగిసినట్టే అని తెలుస్తోంది. వయసు మీద పడటంతో సెలక్టర్లు వీరిద్దరినీ టి20 నుంచి సెలెక్ట్ చేయడం లేదని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ స్టార్ ప్లేయర్లు వన్డే ప్రపంచ కప్ మీదనే దృష్టి పెడుతున్నారు.
Advertisement
గతంలో కూడా సీనియర్స్ ఇదే ఫార్ములాను కొనసాగించారు. 2007 టీ20 మ్యాచ్ లో సీనియర్లు ఎవరు ఆడలేదు. సచిన్, ద్రావిడ్, గంగూలీ లాంటి స్టార్స్ టీ20లకు దూరంగా ఉంటే… మహేంద్ర సింగ్ సారద్యంలో కుర్రాళ్లకు అవకాశం అందించారు. ఇదిలా ఉండగా… 2024 ప్రపంచ కప్ లక్ష్యంగా టి20 యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తున్న బీసీసీఐ…. మర్యాదపూర్వకంగానే వీరిని టీ20 నుంచి తప్పుకోమని చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
టాలీవుడ్ స్టార్ హీరో కోసం తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి…!
Hansika : పబ్ కి తీసుకెళ్లి..బన్నీ బలవంతంగా నాతో ఆ పని చేయించాడు..!
విశాఖలో బేబీ సినిమా రిపీట్..3 కుటుంబాల్లో విషాదం !