తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడే చిరంజీవి సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదుగుతున్న రోజులు అవి. ఆయన నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఓవైపు సూపర్ స్టార్ కృష్ణ బాక్సీపీస్ దుమ్ము దులుపుతున్న సమయంలో ఆయన ధాటికి తట్టుకొని గట్టి పోటీ ఇచ్చిన హీరో చిరంజీవి. అప్పటికే ఖైదీ, విజేత, మగమహారాజు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ వంటి సినిమాల విజయాలతో జోరు మీద ఉన్నారు చిరంజీవి.
తెలుగు సినిమా కమర్షియల్ రంగంలోకి వచ్చే సమయానికి మన హీరోలందరూ ఏదో లోటుతో ఉన్నారు. ఏ దారి లేక ప్రేక్షకులు వారిని చూస్తున్నారు. అలాంటి సమయంలో దర్శక నిర్మాతల ఆలోచనకి, దర్శకుడి ఇమాజినేషన్‌కి వెండితెర కనిపించే ఫర్‌పెక్ట్ నటుడిగా ఎదిగారు చిరంజీవి గారు. మలయాల రీమేక్‌గా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా పసివాడి ప్రాణం. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును సృష్టించనే చెప్పాలి. సూపర్ హిట్ సాధించి అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. చిరంజీవి, విజయశాంతి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా తెలుగు సినిమాలో మొట్టమొదటి సారి బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనట చిరంజీవికే దక్కింది. పసివాడి ప్రాణం సినిమా హక్కులను అల్లు అరవింద్ దక్కించుకున్నారు.
రచయిత జంధ్యాలని పిలిపించి చిరంజీవికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేర్పించారు. అసలు పాటలు పెట్టడానికి అవకాశం లేని ఈ కథలో 5 పాటలు వచ్చేవిధంగా జంధ్యాల తయారుచేశారు. పిల్లలకు, మహిళలకు నచ్చేవిధంగా కథను తయారు చేసింది. విట్‌నెస్ ఆధారంగా బాపినీడు మరోకథను తయారు చేశాడు. కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్‌లో రాధాకృష్ణమూర్తి దర్శకత్వంలో ఆ సినిమా చేయాలనుకున్నారు. ఇందులో బాలనటుడు పాత్రలో మహేష్ బాబు అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో చిరంజీవి ఇదే కథతో సినిమా చేస్తున్నారనే విషయం తెలిసి హీరో కృష్ణ ఆ సినిమాని వెనక్కి తీసుకున్నారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు రఘువరన్. పసివాడి ప్రాణం సినిమాలో విలన్‌గా రఘువరన్ నటించాడు.
ఈ సినిమాకి చాలా టైటిళ్లు అనుకున్నారు. చివరికి పసివాడి ప్రాణం ఖరారు చేశారు. కానీ దర్శకుడు కోదండరామ్‌కి ఆ టైటిల్ నచ్చలేదు. నిర్మాత అల్లుఅరవింద్ లోగోతో సహా డిజైన్ చేయడంతో కోదండరాంరెడ్డి గారు ఒప్పుకున్నారు. మాస్ ప్రేక్షకులకి చిరంజీవి పాటలు అన్న, డ్యాన్స్ అన్నా విపరీతమైన క్రేజ్ ఉండేది. పసివాడి ప్రాణం సినిమాలో ముందు చేసిన పాటని తీసేసి బ్రేక్ డ్యాన్స్ కోసం ఓ పాటను రికార్డింగ్ చేయించారు. చక్కని చుక్కల అనే పాట హల్ చల్ సృష్టించింది. అప్పట్లో పాటలు తీయాలనుకుంటే కాశ్మీర్ వెళ్లాలనుకునేవారు. బ్రహ్మానందం ఈ సినిమాలో అవిటివాడి పాత్రలో కనిపించాడు. ఇక మొత్తానికి 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి 1983 జులై 27న పసివాడి ప్రాణం సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో రఘువరన్ విలనిజానికి మంచి పేరు వచ్చింది. 38 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది.
ఇది కూడా చదవండి : అలనాటి హీరో సుమన్ ఆ కేసుల్లో ఇరుక్కోవడానికి గల కారకులు ఎవరు ? అర్ధరాత్రి పోలీసులు వచ్చి అలా పట్టుకెళ్లారు ?