ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా కీలకం. పెళ్లికి సంబంధించిన నిర్ణయం అత్యంత కీలకమైంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి కుటుంబ సభ్యుల ఒత్తిడితో నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత బాధపడుతుంటారు. వేరే దేశాల్లో వారి కల్చర్ వేర్వేరుగా ఉన్నప్పటికీ.. మన భారతదేశంలో మాత్రం పెళ్లి అంటే ఇద్దరూ వ్యక్తులకు సంబంధించింది కాదు. రెండు కుటుంబాలకు సంబంధించింది. ఆ పెళ్లి విచ్ఛిన్నమైతే రెండు కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. జీవితాంతం పశ్చాత్తాప పడే పరిస్థితులు మన దేశంలో చాలా మందిని చూస్తే ఉంటాం.
Advertisement
ఇబ్బందులు పడే ముందు యువతీ, యువకులు పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మంచిది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకునే జంటలు పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది భార్య భర్తలు చాలా మంచి అనుబంధం కలిగి ఉంటారు. ఆ అనుబంధం నేపథ్యంలోనే తమ కాబోయే భాగస్వామికి ఉన్న కొన్ని చెడు అలవాట్లను లైట్ తీసుకుంటారు. అలా చేయడం పెద్ద పొరపాటుకు దారి తీస్తుంది. వాటి కారణంగానే వైవాహిక జీవితం బాధకరంగా మారుతుంది. ఈ అలవాట్లు ఉన్న వారిని పెళ్లి చేసుకోకూడదని పెద్దలు పేర్కొంటున్నారు. మరి ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఎదుటవి వ్యక్తిని తన కంటే తక్కువగా భావించే వారు చాలా మంది ఉంటారు. ఆర్థిక, ఇతర విషయాల్లో బలహీనంగా ఉండవచ్చు. కానీ అన్ని అంశాల్లో తన నిర్ణయాలను తన భాగస్వామిపై రుద్దుతుంటారు. చాలా సందర్భాల్లో జరుగుతుంది. నిశ్చితార్థం తరువాత మీకు కూడా ఇలాగే అనిపిస్తే పొరపాటున కూడా అలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోవద్దు. కొంత మంది ఒత్తిడి లేదా దురాశతో పెళ్లికి ఒప్పుకుంటారు. ఇలాంటి వారు ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. వారు తమ కాబోయే జీవిత భాగస్వామితో సరిగ్గా మాట్లాడరు. వారితో ఎడబాటుగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
ఏ కారణం చేతనైనా పెళ్లి చేసుకునే విషయంలో అయోమయానికి గురైతే.. వారు చేసిన తప్పు మరొకరి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. పెళ్లి నిశ్చయం తరువాత భాగస్వామి మిమ్మల్ని తరచుగా విస్మరిస్తున్నారని లేదా నిరంతరం చిరాకుగా ఉన్నట్టు మీరు భావించినట్టయితే అలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి. ఇక అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. పరస్పర అవగాహనతో విషయాలు పరిష్కరించకోగలరన్నది నిజం. వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం సహజం, అయితే వేర్వేరు ఆలోచనల కారణంగా తరచుగా చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ప్రతీ చిన్న విషయం విషయానికి ఘర్షణకు దిగడం కారణంగా వారి త్వరగా విడిపోవడం జరుగుతుంది. భాగస్వామి ప్రతి విషయంలోనూ భిన్నంఆ ఆలో చిస్తూఅలాంటి వారిని పెళ్లి చేసుకుంటే ముందు మరోసారి ఆలోచించండి.
Also Read :
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 బ్లాక్ బస్టర్ సినిమాలు…ఈ సినిమాలు గనక చేసి ఉంటే..!