అత్యంత అరుదైన రక్త రుగ్మతతో బాధపడుతున్న 11 ఏళ్ల వరద్కు భారీ ఆర్థిక సాయం చేసి తన గొప్ప మనస్సు చాటుకున్నాడు. భారత క్రికెటర్ కే.ఎల్.రాహుల్ ఆ చిన్నారి ఎముక మజ్జ మార్పిడి కోసం రూ.31లక్షలు విరాళంగా ఇచ్చాడు. నిధులు సమకూరుస్తున్న గివ్ ఇండియా ద్వారా విషయాన్ని తెలుసుకున్న రాహుల్ చలించిపోయాడు. దీంతో తన బృందం ద్వారా వరద్ తల్లిదండ్రులను సంప్రదించి ఆపరేషన్ కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేశాడు.
Also Read : ఊళ్లో వైన్ షాపు కావాలంటూ కలెక్టర్ కు ఫోన్.. ఆయన ఏం సమాధానం ఇచ్చారంటే..!
Advertisement
Advertisement
రాహుల్ సకాలంలో సాయం చేయడంతో పరద్ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఆ బాలుడిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. భవిష్యత్లో ఆ చిన్నారి తన కలలను సాధించాలని రాహుల్ ఆకాంక్షించాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తన ప్రయత్నం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్టు రాహుల్ తెలిపారు. వరద్ తల్లిదండ్రులు సచిన్, స్వప్నఝా రాహుల్కు కృతజ్ఞతలు తెలిపి.. అతనికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
రాహుల్ ముందుకు రాకపోతే సకాలంలో వరద్కు శస్త్ర చికిత్స జరిగేది కాదు అని, తన కుమారుడికి కూడా రాహుల్ లా క్రికెటర్ కావాలనే కోరిక ఉందని చెప్పారు. గివ్ ఇండియా కూడా రాహుల్కు ధన్యవాదాలు తెలిపింది. వరద్కు ఆర్థిక సాయం చేసి పునర్జన్మ కల్పించారని ప్రశంసించారు. రాహుల్ సాయం చేసి స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు.
Also Read : 30 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో ఒక కుటుంబానిదే గెలుపు….!