చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇండస్ట్రీలో మరోవిషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజులు రెడ్డి మృతి చెందారు. రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామానికి చెందిన వ్యక్తి. ఇదిలా ఉండగా వరుసగా ఇండస్ట్రీలో ఇది మూడో విషాదం. ఈనెల 29న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో మృతి చెందారు. కాగా నిన్న ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సైతం అనారోగ్యంతో మృతి చెందారు.
Advertisement
Advertisement
KIRAN ABBAVARAM
Advertisement
నేడు ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇక ఈ రోజు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట విషాదం నెలకొంది. ఇది ఇలా ఉంటే కిరణ్ అబ్బవరం రాజావారు రాణీగారు సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో ఆయనకు క్రేజ్ వచ్చింది. దాంతో రీసెంట్ గా ఆయన ఎస్ ఆర్ కల్యాణ మండపం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించగా కిరన్ కు మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇండస్ట్రీలో ఎదుకుతున్న సమయంలో సోదరుడిని కోల్పోవడం బాధాకరం.