Home » కిరాక్ ఆర్పీ చేపల పులుసు కర్రీ పాయింట్ రీ ఓపెన్

కిరాక్ ఆర్పీ చేపల పులుసు కర్రీ పాయింట్ రీ ఓపెన్

by Bunty
Ad

కిరాక్ అర్పి గురించి తెలియని వారు ఉండరు. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్మీ కర్రీ పాయింట్ బిజినెస్ మొదలుపెట్టాడు. కూకట్పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ ప్రారంభించాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్న చేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు ఇలా అన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతారట.

Advertisement

దీంతో జనం ఎగబడ్డారు. ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిరాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది. జనం తాకిడి తట్టుకోలేక వస్తున్న జనం కోసం సరిపడా చేపల పులుసు వండించలేక షాప్ ను కొంతకాలం మూసేస్తున్నట్లు కిర్రాక్ ఆర్పి తెలిపారు. నెల్లూరు మహిళలు చేపల పులుసు బాగా వండే వాళ్ళు. ఎవరైనా వచ్చి ఆడిషన్స్ లో సెలెక్ట్ అయితే వారికి రెస్టారెంట్లో పని కల్పిస్తామని కిరాక్ ఆర్పి ప్రకటించారు. ఇక వంటగది కెపాసిటీ పెంచి వచ్చిన అందరికీ సరిపడా చేపల పులుసు రెడీ చేస్తున్నట్టు చెప్పిన ఆర్పి కర్రీ పాయింట్ మళ్లీ గ్రాండ్గా రీ ఓపెన్ చేశాడు.

Advertisement

రీ ఓపెన్ సమయంలో కూడా జనాలు చేపల పులుసు కోసం బాగానే క్యూ కట్టారు. కొంతమంది ఇతర ప్రదేశాల నుండి కూడా హైదరాబాద్ కి వచ్చి తన చేపల పులుసు రుచి చూస్తున్నట్లు ఆర్పీ వివరించారు. పండుగ సమయంలో ఒక నాలుగు రోజులు షాప్ మూతపడుతుందని మళ్లీ తిరిగి ఓపెన్ చేస్తామని తెలిపారు. అయితే రెస్టారెంట్ పని చేసే సమయం, క్లోజ్ చేసే సమయం ముందుగానే చెబుతామని ఆర్పి వెల్లడించారు.

READ ALSO : వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు కేసీఆర్ బంపర్ ఆఫర్

Visitors Are Also Reading