Home » వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు కేసీఆర్ బంపర్ ఆఫర్

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు కేసీఆర్ బంపర్ ఆఫర్

by Bunty
Ad

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణం. ఇక తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవి ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ వస్తే అభిమానులకు పండగే పండగ, సరిగ్గా ఆరు సంవత్సరాల తర్వాత మరోసారి బాక్సాఫీస్ వద్ద ఒకరికొకరు ఢీ కొట్టడానికి రెడీ అయ్యారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీతో, బాలకృష్ణ వీర సింహారెడ్డి తో బరిలోకి దిగనున్నారు.

Advertisement

ఈ రెండు చిత్రాలకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం. అయితే ఈ సినిమాను సంక్రాంతి వేల రిలీజ్ చేయాలని ఇప్పటికే ప్రకటించారు. మరి ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి పోటీలో నిలబడడం వల్ల చిత్ర యూనిట్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే చాలా సినిమాలతో బాలయ్య, చిరంజీవి పోటీలో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా సంక్రాంతి బరిలో అనేకసార్లు చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడ్డారు.

Advertisement

ఇది ఇలా ఉండగా, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. రిలీజ్‌ రోజున 6 షోలు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12న వీర సింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. దీంతో 12వ తేదీ ఉదయం 4 గంటల ఆటకు వీరసింహారెడ్డి చిత్ర ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 13వ తేదీ ఉదయం 4 గంటల ఆటకు వాల్తేరు వీరయ్య చిత్ర ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అభ్యర్థనపై స్పందించి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకు ఒక్క రోజు మాత్రమే ఆరో ఆటకు అనుమతి ఇచ్చింది.

READ ALSO : ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో..ఇప్పుడు ఆ పనులు చేస్తుందా ?

Visitors Are Also Reading