Home » మందుబాబులకు గుడ్ న్యూస్… కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ వచ్చేసింది…!

మందుబాబులకు గుడ్ న్యూస్… కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ వచ్చేసింది…!

by Bunty
Ad

 

సాధారణంగా ఇళ్లలో ఏదైనా ఫంక్షన్లు, పండుగలు జరిగినప్పుడు లేదా ఫ్రెండ్స్ కలిసినప్పుడు చాలామంది మద్యం సేవిస్తుంటారు. ఇక మద్యం తాగేవారిలో ఎక్కువ మంది బీర్ తాగుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఎంతో ఇష్టమైన మద్యపానియం బీరు. కూల్ డ్రింక్ తాగినట్టుగానే బీరు తాగడం హాబీగా మారుతుంది. ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగేస్తుంటారు.

Read Also : Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?

Advertisement

బీరులో సాధారణంగా 5 నుంచి 6% వరకు ఆల్కహాల్ ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మన దేశంలో లీడింగ్ బీర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ ఇన్ స్టాంట్ బీర్ ప్యాకెట్లు వచ్చాయి. యునైటెడ్ బ్రివరీస్ గ్రూప్ సంస్థ కింగ్ ఫిషర్ ఇన్ స్టాంట్ బీర్ ను విడుదల చేసింది. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో బీర్ సాచెట్స్ పౌడర్ ను దేశంలోని వినియోగదారుల కోసం విడుదల చేసింది.

Advertisement

Read Also : మరో నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : CM KCR

బీర్ పౌడర్ మిక్స్… వీటిని బీర్ సాచెట్స్ అని పిలుస్తుంటారు. ఈ బీర్ పౌడర్ తో బీరు తయారు చేయడం ఎలా అంటే… బీర్ సాచెట్స్, నీళ్లు ఉంటే చాలు. క్షణాల్లో బీరు సిద్ధమవుతుంది. మీకు దగ్గరలో జగ్ కానీ మగ్ కానీ మినరల్ వాటర్ డబ్బా కానీ ఏది ఉన్న ఒకేసారి బీర్ పౌడర్ కలిపి బీరు తయారు చేసుకోవచ్చు. బీర్ పౌడర్ శాంపిల్స్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు కింగ్ ఫిషర్ అవకాశం కల్పించింది. కిక్ ఎక్కించే టేస్టీ బీర్ ను రుచి చూడాలంటే kingfisherworld.com/instantbeer లో రిజిస్టర్ చేసుకోండి.

READ ALSO : రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!

Visitors Are Also Reading