సాధారణంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజు పెరుగుతుంది. కిడ్నీ సమస్యలు రావడానికి మనం తీసుకునే ఆహార పదార్థాలు, మన జీవన శైలి విధానం ప్రధాన కారణమని చెప్పవచ్చు. కొందరికీ కిడ్నీలలో రాళ్లు ఏర్పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారు కేవలం ఈ ఆకు యొక్క రసంతో ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు.
Advertisement
సాధారణంగా మనం ఇంటి చుట్టు పరిసర ప్రాంతాల్లో చాలా రకాల ఔషద మొక్కలుంటాయి. కానీ వాటిలో ఉన్నటువంటి ఔషద గుణాలు తెలియక మనం వాటిని చాలా తేలికగా తీసుకుంటాం. ఈ క్రమంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మొక్కల్లో అటిక మామిడితీగ ఒకటి. మన పరిసర ప్రాంతాల్లో ఎంతో విరివిగా లభిస్తుంది. అటిక మామిడి తీగ రసం వల్లకిడ్నీ ఏర్పడిన రాళ్లను తొలగించుకోవచ్చు. అటిక మామిడి తీగలోనే ఆకులు పువ్వులు, వేర్లు చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు వందల మిల్లీలీటర్ల నీటిలో వేసి బాగా మరిగించాలి.
Advertisement
ఏడు నిమిషాల పాటు మరిగించిన తరువాత వడగట్టుకొని ఈ కషాయాన్ని సేవించాలి. ఇలా ప్రతిరోజు ఉదయం 50 మి.లీ. కషాయాన్ని తాగడం వల్ల ఇది మన శరీరానికి సర్వరోగ నివారణగా పని చేస్తుంది. దీని కషాయం కేవలం కిడ్నీ సంబంధిత సమస్యలను మాత్రమే కాదు.. మన శరీరంలో అన్ని జీవక్రియలు సరైన విధంగా పని చేయడానికి కారణమవతుంది. గుండె పనితీరును మెరుగుపరచడానికి జీర్ణక్రియ శక్తిని మెరుగుపరచడానికి అటిక మామిడి తీగ ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read : టమోటాలు ఎక్కువగా తింటున్నారా..? అయితే మీకు ఆ ప్రమాదం పొంచి ఉన్నట్టే..!