ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా పెద్ద హిట్ అనేది అందుకున్న యంగ్ టైగెర్ ఎన్టీఆర్.. ఇప్పటివరకు ఆయన కొత్త సినిమాను ప్రారంభించలేదు. అయితే ప్రస్తుతం కొరటాల శివ అలాగే ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. కానీ కొరటాల సినిమా అనేది ఇంకా ప్రారంభమ కాలేదు. దాంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ ఆసక్తి అనేది ఎక్కువ అవుతుంది.
Advertisement
ఎప్పుడు ఈ సినిమాను కొరటాల ప్రారంభిస్తారా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటె ఈ సినిమాలో హీరోయిన్ కోసం తెగ వెతుకుతున్నారు. అయితే మొదట ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ అనేవి కుదరక ఈ సినిమాకు నో చెప్పింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కు జోడిగా ఆలియా భట్ ను తేవాలి అనుకున్నారు. కానీ అంతలోనే ఆమె ప్రెగ్నెట్ అని ప్రకటించింది.
Advertisement
అందువల్ల చేసేది ఏం లేక.. ఈ సినిమా హీరోయిన్ కోసం వెతుకులాట కొనసాగిస్తూ.. రష్మిక మందాన దగ్గరకు వచ్చారు. కానీ ఈ అమ్మడు రెమ్యునరేషన్ అనేది ఎక్కువ చెప్పడంతో మళ్ళీ కొత్త హీరోయిన్ వేటలో పడ్డారు. ఇక ఇప్పుడు చివరగా బాలీవుడ్ హీరోయిన్ అయిన కియారా అద్వానీని ఎన్టీఆర్ కు జోడిగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం కియారాను సంప్రదిస్తే.. ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :