కేజీఎఫ్ తో రికార్డులు క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. ఈ సినిమాతో యష్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అప్పటికే కన్నడలో స్టార్ గా ఉన్న యష్ కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అయితే యష్ తన కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ లో నటించారన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా యష్ తండ్రి ఓ ఆర్టీసీ డ్రైవర్ అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. ఇక యష్ లవ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింట్ గానే ఉంటుంది.
Advertisement
యష్ భార్య రాధిక కూడా కన్నడ నటి కావడం విశేషం. యష్ సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో నందగోకుల సీరియల్ షూటింగ్ లో మొదటిసారిగా రాధికా పండిట్ ను కలుసుకున్నారు. యష్ చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి అని రాధిక మనసులో అనిపించింది. ఇక అదే విధంగా యష్ మనసులో కూడా రాధిక చాలా సింపుల్ అనే భావన కలిగిందట. ఇక ఈ సీరియల్ షూటింగ్ సమయంలో ఒకే క్యాబ్ లో ఇద్దరూ కలిసి షూటింగ్ లకు వెళ్లిరావడం చేసినా కూడా ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదట.
Advertisement
ఈ సీరియల్ తరవాత నాలుగేళ్లకు ఇద్దరూ కలిసి మళ్లీ మొగ్గిన మనసు అనే సీరియల్ లో నటించారు. ఆ తరవాత మరో నాలుగేళ్లకు డ్రామా అనే సినిమాలో నటించారు. ఇక ఇలా వరుసగా కలిసి నటిస్తూ ఉన్న క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం బలంగా మారింది. ఆ తరవాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఇద్దరూ చాలా కాలం పాటు ఆ విషయం బయటపెట్టలేదు.
ఇక చివరికి యష్ దైర్యం చేసి రాధికకు ఫోన్ చేసి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. ఫోన్ చేసిన సమయంలో రాధిక తన ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళుతున్నట్టు చెప్పింది. దాంతో ఫోన్ లో చెప్పకుండా యష్ నేరుగా అదే థియేటర్ కు వెళ్లి మాల్ లో ఆమెకు నచ్చిన వస్తువులన్నీ కొనుగోలు చేసి ఆమె కార్ లో పెట్టి సర్ప్రైజ్ చేసి ప్రపోజ్ చేశాడు. తాను కూడా ప్రేమించినప్పటికీ రాధిక తనకు ఆరునెలలు టైం కావాలని చెప్పి హెల్డ్ లో పెట్టింది. యష్ వెయిట్ చేశాడు. చివరికి రాధిక ఓకే చెప్పేసింది. ఇద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు.
ALSO READ :
2 రెండు రోజులు తిండి తప్పలు మానేసి ఏడుస్తూ కూర్చున్నా..దేవినాగవల్లి ఎమోషనల్..1
దేవి నాగవల్లితో లొల్లి హీరోలకు కలిసివస్తుందా..? నెట్టింట ట్రోల్స్..!