Home » కేజీఎఫ్ న‌టి మాళ‌విక భ‌ర్త ప్ర‌ముక టాలీవుడ్ విల‌న్ అన్న సంగ‌తి తెలుసా…ఎవ‌రంటే..!

కేజీఎఫ్ న‌టి మాళ‌విక భ‌ర్త ప్ర‌ముక టాలీవుడ్ విల‌న్ అన్న సంగ‌తి తెలుసా…ఎవ‌రంటే..!

by AJAY
Ad

ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కొన్ని సినిమాలు రికార్డులు బ‌ద్దలు కొడ‌తాయి. అలాంటి సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒక‌టి. ఈ సినిమాను క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ క‌న్న‌డ స్టార్ య‌ష్ హీరోగా తెరెక్కించాడు. ఈ సినిమా గోల్డ్ మైన్స్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలతో నిండి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది.

Advertisement

సినిమాలో విల‌న్ల పాత్ర‌లు వాళ్ల పేర్లు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో ప్ర‌తిదీ హైలెట్ గానే నిలిచింది. దాంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల హృద‌యాల‌లో నిలిచిపోయింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ 2ను కూడా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఎప్రిల్ 14న విడుద‌ల కానుంది. కేజీఎఫ్ లో గుర్తిండిపోయే పాత్ర‌ల‌లో న‌టి మాల‌విక చేసిన ఆషీస‌ర్ రోల్ కూడా ఒక‌టి.

Advertisement

ఇప్పుడు మీ హీరో ఏం చేస్తాడు అంటూ మాళ‌విక మ‌ధ్య మ‌ధ్య‌లో అడిగే సీన్లు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక కేజీఎఫ్ 2 లో కూడా మాళ‌విక పాత్ర క‌నిపించ‌బోతుంది. ఇదిలా ఉంటే మాళ‌విక ఎన్నో సినిమాల‌లో గుర్తుండిపోయే పాత్ర‌లు చేసింది. అంతే కాకుండా మాళ‌విక భ‌ర్త కూడా తెలుగు సినిమాల్లో న‌టించాడు అన్న సంగ‌తి చాలా మందికి తెలియదు.

అంతే కాకుండా ఆయ‌న ప్ర‌ముక విల‌న్ గా కూడా ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు నటుడు అవినాష్. అవినాష్ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ సినిమాల‌లో విల‌న్ న‌టించారు. ఇక తెలుగులో అవినాష్ ర‌జినీకాంత్ హీరోగా న‌టించిన చంద్ర‌ముఖి సినిమాలో భూత‌వైద్యుడి పాత్ర‌లో న‌టించారు. అంతే కాకుండా అవినాష్ ర‌వితేజ హీరోగా న‌టించిన ద‌రువు సినిమాలో కూడా విల‌న్ గా న‌టించి ఆక‌ట్టుకున్నారు.

Visitors Are Also Reading