సినిమా – కేజిఎఫ్ చాప్టర్ -2
నటినటులు – యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావురమేష్, ఈశ్వరరావు మరికొందరు.
Advertisement
దర్శకుడు- ప్రశాంత్ నీల్
నిర్మాత- విజయ్ కిర్గందూర్
నిర్మాణ సంస్థ- హోంబలి
సంగీత దర్శకుడు- రవి బస్రర్
పరిచయం :
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగిపోయింది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. తెలుగుతో పాటు హిందీ తమిళ భాషల్లోనూ కేజిఎఫ్ రికార్డులు క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా రెండవ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య కేజిఎఫ్ చాప్టర్ 2 తాజాగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా….? లేదా..? అన్నది ఇప్పుడు చూద్దాం.
కథ & కథాంశం :
కేజిఎఫ్ పార్ట్ 1 లో గరుడ ను చంపిన తర్వాత రాఖీ భాయ్ యష్ కేజిఎఫ్ ను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఇక గరుడ మరణించిన తర్వాత రాఖీ బాయ్ నుండి ఢీ కొట్టేందుకు గరుడ సోదరుడు అధీరా సంజయ్ దత్ రంగంలోకి దిగుతాడు. దాంతో రాఖీ బాయ్ మరో పెద్ద సవాల్ ను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా రాఖీ బాయ్ అధీరాను గెలవడంతో పాటూ రాజకీయంగా కూడా పెద్ద సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత ప్రధాని రమీకా సేన్ రవీనా టండన్… అధీరా అనే రెండు పెద్ద శక్తులతో రాఖీ బాయ్ ఎలా పోరాడాడు. అధీరా పై విజయం సాధించాడా..? రమీకా సేన్ ప్రభుత్వంతో ఎలా పోరాడాడు..? విజయం సాధించడం లేదా అన్నదే ఈ సినిమా కథ.
Advertisement
నటీనటుల పర్ఫామెన్స్ :
సినిమాలో యష్ తన నటనతో అబ్బురపరిచాడు. కేజిఎఫ్ పార్ట్ 1 కంటే నటనలో అదరగొట్టాడు. కేజిఎఫ్ పార్ట్ 2లో అంతకుమించి అన్నట్టుగా యాక్షన్ చూపించాడు. క్లాస్ గా కనిపించే సూట్లు వేసుకొని పొడవాటి జుట్టు గడ్డంతో ఎంతో స్టైలిష్ లుక్లో అలరించాడు. ఈ సినిమా మొదటి భాగంలో నటన పరంగా ఎమోషనల్ ఛాలెంజ్ ను విసిరేసినప్పటికీ…. రెండవ భాగంలో స్టైలిష్ ఎలివేషన్లు, ఓ రేంజ్ లో చూపించారు. కేజీఎఫ్ పార్ట్ 1 లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. కానీ పార్ట్ 2లో ఆమె పాత్ర పరిధి పెరిగింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో కథను మలుపు తిప్పే సన్నివేశం లో ఆమె కనిపిస్తుంది. పార్ట్ 1 లో అనంతరావు చేసిన పాత్రను పార్ట్ 2 లో ప్రకాష్ రాజ్ చేయగా ఆయన కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ తన పాత్రకి న్యాయం చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా భీకరంగా కనిపించాడు. సంజయ్ దత్ విలన్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. రమీకా సేన్ పాత్రలో రవీనాటాండన్ ఒదిగిపోయారు. ఆమె దూకుడు సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. రావు రమేష్, ఈశ్వరీరావు పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి.
ఇవి చదవండి :
మద్యం తాగుతూనే కథలు రాస్తా అంటున్న ఆ స్టార్ డైరెక్టర్..!
జల్సా సినిమా కోసం మమ్ముట్టిని సంప్రదించిన అల్లు అరవింద్…కానీ ఆయన ఏమన్నారో తెలుసా..!