ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీఎం కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. ఏపీలో కీలక నేతలను BRS పార్టీలో చేర్చుకున్నారు సీఎం కేసీఆర్. తాజాగా సీఎం కేసీఆర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర, పార్థసారథి మరియు పలువురు కీలక నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో BRS పార్టీలో చేరారు.
Advertisement
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి పార్టీ కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడారు. భారత్ లో అత్యద్భుత వ్యవసాయ అనుకూల వాతావరణం ఉంది.. 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు సీఎం కేసీఆర్.
Advertisement
సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెరుగుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు. అలాగే ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలో భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని కూడా వివరించారు. వైసిపి పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరుతానని ఫోన్లు చేస్తున్నారని కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వమే నడిపిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి : Kirrak RP : నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్ చేసిన జబర్దస్త్ కమెడియన్..