Home » 9, 10వ తరగతి పరీక్షలపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం….పరీక్షా సమయాల్లో మార్పులు !

9, 10వ తరగతి పరీక్షలపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం….పరీక్షా సమయాల్లో మార్పులు !

by Bunty
Ad

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 03 నుంచి 10వతరగతి పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే, ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే, 9, 10వ తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతిలో పరీక్షలను కేవలం 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది.

Advertisement

2022-23 నుంచి సంస్కరణలను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఒక్కో సబ్జెక్టులో పరీక్షలకు 80, ఫార్మేటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్ పేపర్ లో ఫిజిక్స్, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా, ఇంతకుముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం పది వార్షిక పరీక్షలను 11 నుంచి 6 పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే.

Advertisement

విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాజాగా 9, 10 తరగతిలకు ఆరేసి పేపర్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను రెండు పేపర్లుగా నిర్వహించేవారు. ఇక హిందీ సబ్జెక్టుకు ఒకే పరీక్ష నిర్వహించేవారు. అలాగే పరీక్షా సమయం మూడు గంటలకి కేటాయించగా, సైన్స్ పేపర్ కు మాత్రం 3:20 నిమిషాల సమయం కేటాయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

READ ALSO : టాలీవుడ్‌లో మరో విషాదం…’గ్యాంగ్ లీడర్’ నటుడు మృతి

Visitors Are Also Reading