Home » తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

by Anji
Ad

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్‌ అయినప్పటికీ వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో కొనసాగుతున్న అధికారుల వివరాలపై ఆరా తీస్తోంది. జనవరి 17న సాయంత్రం 5 గంటల్లోగా రిపోర్టు ఇవ్వాలని సీఎస్ శాంతి కుమారి  అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్కియాలజీ,  MCHRD, దేవాదాయ శాఖల్లో రిటైర్డ్‌ అయినప్పటికీ పలువురు అధికారులు పదవిలో కొనసాగుతున్నట్లు సమాచారం. వారిని కొత్త ప్రభుత్వం తొలగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

CM REVANTH REDDY

CM REVANTH REDDY

రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి  అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలి అని తేల్చి చెప్పారు. భూ సేకరణతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌  పనులకు టెండర్లు పిలవాలని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని ఎన్‌హెచ్‌గా ప్రకటించాలని ఎన్‌హెచ్‌ఏఐని కోరారు సీఎం రేవంత్. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

Advertisement

 

దావోస్‌లో  ప్రపంచ ఆర్థిక ఫోరం  అధ్యక్షుడితో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. 4వ పారశ్రామిక విప్లక కేంద్రం.. సీ4ఐఆర్‌ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. బయోఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న సీ4ఐఆర్‌ ప్రారంభం కానుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యంతో వేగంగా లక్ష్యాలు అందుకోవచ్చని పేర్కొన్నారు.

 

 

Visitors Are Also Reading