Home » మహానటుడితో మహానటి..?

మహానటుడితో మహానటి..?

by Azhar
Ad
టాలీవుడ్ లో ప్రస్తుతం చాల మంది హీరోలు ఉన్నారు. అయితే అందులో కొందరు డ్యాన్స్ బాగా చేస్తే.. కొందరు బాగా డైలాగ్స్ చెబుతారు. ఇంకొందరు బాగా నటిస్తారు. కానీ ఇవ్వని కలిపి ఉన్న ఒక్కే ఒక్కే హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు తెలుగులో ఉన్న హీరోలలో ఎన్టీఆర్ మహా నటుడు అని.. తోటి హీరోలు కూడా చెబుతారు. ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దేశం మొత్తం కూడా ఈ విషయం ఒప్పుకుంది.
అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొత్తగా చేస్తున్న సినిమాల్లో కొరటాల శివతో మొదట చేయనున్నాడు. ఈ సినిమా అనేది చాలా ఆలస్యం అయినా కూడా తొందరలోనే ఈ సినిమా షూటింగ్ అనేది అల్లు స్టూడియోస్ లో ప్రారంభం అవుతుంది అని తెలుస్తుంది. ఇదిలా ఉంటె.. ఇన్ని రోజులు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఫిక్స్ కాలేదు.
కానీ తాజాగా ఈ సినిమాలో మహా నటుడి జంటగా మహానటి నటించబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు .హీరోయిన్స్ ఉండగా.. రెండో హీరోయిన్ గా శ్రీలీలను లాక్ చేయగా.. ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా కీర్తి కురేష్ ను తీసుకున్నారు అని తెలుస్తుంది. అయితే మహానటి సినిమాతో కీర్తి కురేష్ దేశ వ్యాప్తంగా పేరు అనేది తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మహా నటుడు.. మహానటి కాంబినేషన్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

Advertisement

Visitors Are Also Reading