Home » ఇండియా పరువు తీసిన కెఎల్ రాహుల్..!

ఇండియా పరువు తీసిన కెఎల్ రాహుల్..!

by Azhar
Ad
భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెలలో ప్రారంభం కాబోతున్న ప్రపంచ కప్ కోసం రెండు వరాల ముందే ఆసీస్ వెళ్ళింది టీమిండియా. అయితే ప్రస్తుతం మన భారత జట్టు అక్కడ వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. ఇక ఈరోజు వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో రెండో వార్మప్ మ్యాచ్ అనేది ఆడింది భారత్. ఇక ఈ మ్యాచ్ లో మన జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేసాడు.
ఈ జట్టులో రోహిత్ ఉన్న కూడా రాహుల్ కెప్టెన్సీ చేయడం అనేది అందరికి ఆశ్చర్యం కలిగించినా.. ఈ మ్యాచ్ ఫలితం అనేది ఇంకా ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ తర్వాత రాహుల్ కు భారత జట్టు పగ్గాలు అనేవి అందించాలి అని బీసీసీఐ భావిస్తుంది. అయితే మొదటిసారి సౌత్ ఆఫ్రికాపై కెప్టెన్సీ చేసి వరుసగా నాలుగు మ్యాచ్ లలో జట్టును గెలిపించలేకపోయిన కెప్టెన్ రాహుల్.. ఈ మ్యాచ్ లో కూడా జట్టుకు విజయం అనేది అందించలేకపోయాడు.
సౌత్ ఆఫ్రికా అంటే.. అంతర్జాతీయ జట్టు అని అందరూ సరిపెట్టుకున్న.. ఈరోజు ఆస్ట్రేలియాలోని ఒక లోకల్ జట్టుపైన కూడా రాహుల్ జట్టును గెలిపించలేకపోయాడు. ఇక ఇలా వార్మప్ మ్యాచ్ లో ఓ లోకల్ జట్టు చేతిలో భారత జట్టు అనేది ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దాంతో భారత్ పరువు తీసాడంటూ కేఎల్ రాహుల్ పైన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.

Advertisement

Visitors Are Also Reading