సినీ ప్లాప్‌లు, హిట్‌లు అనేది సర్వసాధారణమే. కెరీర్‌లో ఎన్ని ప్లాప్‌లు వచ్చినా.. ఒక్క హిట్ చాలు అలాంటి విజయం వస్తే అంతకు ముందు వచ్చిన ప్లాప్‌లు అన్ని మరిచిపోతుంటారు. అలాంటి ఓ సంచలన విజయం కీర్తీ సురేష్‌కు మహానటి రూపంలో వచ్చినది. దానికి ముందు ఈమె నటించిన సినిమాలు ఏవి పెద్దగా ఆడలేదు. అంతకు ముందు ఈమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. నేను శైలజ, నేను లోకల్ లాంటి ఒకటి రెండు సినిమాలు బాగానే ఆడినా కూడా అందులో ఈమె నటనకు అంతగా గుర్తింపు రాలేదు. రెగ్యులర్ హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది.
Advertisement
అలాంటి సమయంలోనే వచ్చిన మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుని దెబ్బకు స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ మధ్యనే గుడ్ లక్ సఖి అంటూ వచ్చిన కీర్తి సురేష్ సినిమా ప్రమోషన్స్‌లలో భాగంగానే తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా తన కెరీర్ మొదలైన కొత్తలో ఎదుర్కొన్న సమస్యల, విమర్శల గురించి వివరించింది.
కీర్తి సురేష్ తల్లి మేనక ఒకప్పటి నటి. తెలుగులో చిరంజీవితో కూడా ఈమె నటించింది. వారసురాలు కావడంతో కీర్తి సురేష్‌కు మొదట్లో విమర్శలు బాగానే వచ్చాయి. వీటిని తలుచుకుని ఇప్పుడు ఎమోషనల్ అయింది ఈ భామ. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు అని కీర్తి సురేష్ బాధ పడింది.
Advertisement
తాను అప్పట్లో ఓ స్టూడియోకు వెళ్లితే.. అక్కడ తనను చూసిన కొంత మంది ఆ కొత్త అమ్మాయిని పెట్టుకుంటే సినిమా ఆగిపోతుందని కామెంట్స్ చేశారని, ఆ సమయంలో దానిని బాగా ప్రచారం కూడా చేశారని చెప్పింది. తొలుత బాధగా అనిపించినా.. తరువాత అవి అలవాటు అయిపోయాయని, అలాంటి వాళ్లకు విజయంతోనే సమాధానం చెప్పాలి అని అనుకున్నట్టు తెలిపింది కీర్తి సురేష్.
ఒకే ఒక్క హిట్ రాగానే అవన్నీ మరిచిపోయారు అని, ఆ విమర్శలు అన్ని చెవికి వినిపించనంత దూరంగా వెళ్లిపోయాయని చెప్పింది. ప్రస్తుతం ఈమె మహేష్‌బాబుతో సర్కారు వారి పాటలో నటిస్తుంది. దాంతో పాటు వంశీపైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించబోయే సినిమాలో కూడా కీర్తిని ఫైనల్ చేశారు. ఈ మధ్య ఈమె నటించిన గుడ్ లక్ సఖి విడుదల అయింది. నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపించింది. అయితే మిస్ ఇండియా, పెంగ్విన్ తరువాత కీర్తి సురేష్ ఖాతాలో మరొక ప్లాప్ ఇది అని చెప్పవచ్చు. మరొక వైపు కథ సెలక్ట్ చేసుకునే విధానంలో కీర్తి సురేష్ విఫలం చెందారని నెటిజన్లు పేర్కొంటున్నారు.